Anil ravipudi: షూటింగ్ స్టార్ట్ కాలేదు..రిలీజ్ డేట్ ఫిక్స్..ఏ సినిమా అంటే ..?
- అనిల్ రావిపూడి - విక్టరీ వెంకీ హ్యాట్రిక్ చిత్రం
- గతంలో వీరి కాంబోలో F2- F3 వంటి హిట్ చిత్రాలు
- ఆగస్టు నుండి షూటింగ్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్ ఇటీవల సైంధవ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. తాజగా వెంకీ మరో చిత్రాన్ని ప్రారంభించాడు. గతంలో F2, F3 వంటి రెండు సూపర్ హిట్లు అందించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ నటించనున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన కూడా ఇటీవల విడుదల చేసారు మేకర్స్. గతంలో హాస్యం ప్రధానంగా సాగే కథాంశాన్ని ఎంచుకున్న అనిల్ రావిపూడి ఈ దఫా సరికొత్త కథతో రానున్నాడు. ‘ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ పోలీస్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ థీమ్’ లో సాగనుంది ఈ చిత్రం.
కాగా ఈ చిత్రాన్ని ఆగస్టు నుండి షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ప్రస్తుతం అందుకు తగ్గట్టు లుక్ మార్చే పనిలో ఉన్నారు. ఆగస్టు మొదటి వారంలో వెంకీ మామ ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు. ఆగస్టు నుండి కంటిన్యూ షూట్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి గతంలో చేసిన సరిలేరు నీకెవ్వరు చిత్రన్ని కేవలం ఐదు నెలల్లో తీశారు. వెంకీతో తెరకెక్కించే చిత్రం కూడా ఐదు నెలల్లో షూటింగ్ ముగించి 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు పక్కా ప్లానింగ్ వేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు . వెంకీ,అనిల్ రావిపూడి, దిల్ రాజుల హ్యాట్రిక్ కాంబోగా గా ఈ చిత్రం రానుంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి వెంకీ సరసన జోడీలుగా నటించనున్నారు. ఈ చిత్రానికి “సంక్రాంతికి వస్తున్నాం” అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
Also Read: Chiranjeevi : మెగాస్టార్ 157 స్టోరి రెడీ..దర్శకుడు ఎవరంటే..?
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు