హనుమాన్ సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ కు నిరంజన్ రెడ్డి నిర్మించడం లేదు. అందుకు దర్శకుడుకి, నిర్మాతకు మధ్య వివాదాలే కారణమని తెలుస్తోంది. తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మపై నిర్మాత నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
నిరంజన్ రెడ్డి వాదన : హనుమాన్ సినిమా తరువాత మా బ్యానర్ లో అధీర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మరాక్షస వంటి సినిమాలు చేస్తానని మా దగ్గరనుండి ప్రశాంత్ వర్మ రూ. 10.34 కోట్లు అడ్వాన్స్ తీసుకుని సినిమా చేయమంటే ఏవేవో సాకులు చెప్తున్నాడు. ఆ ఐదు సినిమాల లాస్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కింద ప్రశాంత్ వర్మ నుండి రూ. 200 కోట్లు ఇప్పిచండి. టాలీవుడ్ కు చెందిన వేరే నిర్మాత దగ్గర ఉన్న ఆక్టోపస్ అనే సినిమాను రూ. 10.23 కోట్లు ఖర్చు పెట్టి కొనిపించాడు. కానీ ఆ సినిమా NOC ఇప్పించడం లేదు. అధీర డైరెక్ట్ చెయ్యడానికి కోటి రూపాయిల అడ్వాన్స్ ఇచ్చా ప్రశాంత్ వర్మకు. జై హనుమాన్ మాకు చెయ్యడం లేదు కాబట్టి నాకు రూ. 100 కోట్లు ఇవ్వాలి, ప్రశాంత్ వర్మ చేస్తున్న సినిమాలను ఆపండని ఛాంబర్ లో కంప్లైంట్ చేసాడు నిరంజన్ రెడ్డి
Also Read : SSMB 29 : ఎక్స్ లో రాజమౌళి – మహేశ్ బాబు, పృద్విరాజ్, ప్రియాంక చోప్రా ఫన్ని చాటింగ్
ప్రశాంత్ వర్మ వివరణ : అసలు నేను ఆ ఐదు సినిమాలు చేస్తా అని ఎక్కడా చెప్పలేదు. అగ్రీమెంట్లు కూడా చేయలేదు. ఆక్టోపస్ సినిమా విషయంలో ఏదైనా ఇష్యూ ఉంటే ఒరిజినల్ ప్రొడ్యూసర్ తో తేల్చుకోవాలి. ఐదు సినిమాలకు సంబంధించి నాకు రూ. 15.82 కోట్లు మాత్రమే అందాయి, అవి అడ్వాన్స్ కాదు హనుమాన్ సినిమాకు గాను నాకు రావాల్సిన షేర్. కోటి రూపాయిలు అధీర సినిమా కోసం ఇవ్వలేదు, టీజర్ ను డైరెక్ట్ చెయ్యడానికి ఇచ్చారు. హనుమాన్ లో నా వాటా ఎగ్గొట్టి డార్లింగ్, సంబరాల ఏటిగట్టు, బిల్లా రంగా భాష సినిమాలకు డైవర్ట్ చేశారు. హనుమాన్ రూ. 295 కోట్లు collect చేసింది. అందులో నా వాటా నాకు చాలా రావాలి. అది ఎగ్గొట్టడానికే ఈ కథ అల్లుతున్నారని ప్రశాంత్ వర్మ ఛాంబర్ కు చెప్పారు.
ఈ విషయమై ఇటు వర్గాలు అఫీషయల్ గా నోట్ రిలీజ్ చేసారు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుందో చూడాలి.