టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్న ఈ సినిమా నుండి సినిమా నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ రావడం లేదు. కొన్ని నెలల క్రితం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో చేసారు. ఆ టైమ్ లోనే ఈ సినిమాకు సంబందించి కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట లీక్ అయ్యాయి.
తాజగా ఈ సినిమా అప్డేట్స్ గురించి మహేశ్, రాజమౌళి, పృద్విరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా మధ్య ఎక్స్ లో ఫన్నీ చాట్ చేసుకున్నరు. ఎవరెవరు ఏవమన్నారంటే..
మహేశ్ : నవంబర్ నెల వచ్చింది రాజమౌళి
SS రాజమౌళి : అవును..ఈ నెలలో ఏ సినిమాకు రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావ్ మహేశ్
మహేశ్ : ”మీరు ఎప్పటి నుంచో తయారు చేస్తున్న మహాభారతం సినిమాకి ఇస్తాను” అని జక్కన్నకు పంచ్ వేశాడు బాబు. ‘నవంబర్‌లో మీరు మాకు ఏదో హామీ ఇచ్చారు. మీ మాట నిలబెట్టుకోండి.
SS రాజమౌళి : ఇప్పుడే కదా మొదలైంది మహేశ్. ఒక్కొక్కటిగా నిదానంగా వెల్లడిస్తాము
మహేశ్ : ‘ఎంత నెమ్మదిగా ఇస్తారు సార్? పోనీ 2030లో స్టార్ట్ చేద్దామా. ఇప్పటికే మన దేశీ పాప ప్రియాంక చోప్రా జనవరి నుంచి హైదరాబాద్‌లోని ప్రతి వీధిలో తన ఇన్‌స్టా స్టోరీలను పోస్ట్ చేస్తోంది’
ప్రియాంక చోప్రా : హలో హీరో.. సెట్‌లో నువ్వు నాతో పంచుకునే కథలన్నీ లీక్ చేయమంటావా? మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా ఏసేస్తా” అంటూ మహేష్ స్టైల్ లో రిప్లై ఇచ్చింది.
SS రాజమౌళి : అసలు ”ప్రియాంక చోప్రా నటిస్తుందనే విషయాన్ని నువ్వు ఎందుకు లీక్ చేసావ్ మహేశ్. నువ్వు సర్ప్రైజ్ ని నాశనం చేసావ్
మహేశ్ : సర్ప్రైజా?. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక సర్ప్రైజ్ అని చెప్పాలనుకుంటున్నారా?’
పృథ్వీరాజ్ సుకుమారన్ : ‘రాజమౌళి సార్. నేను ఇలాగే హైదరాబాద్ వెకేషన్ కి తిరిగితే, నా ఫ్యామిలీ నన్ను అనుమానించడంస్టార్ట్ చేస్తారు” అంటూ తన బాధ చెప్పుకున్నారు
SS రాజమౌళి : ”మహేష్.. ఇప్పుడు నువ్వు అన్నీ నాశనం చేశావు”
మహేశ్ : . ”సరే ఒక డీల్ చేసుకుందాం. మీరు ఇప్పటికీ దాన్ని సర్ప్రైజ్ అని అనుకుంటే అందరికీ తెలిసిన ఏదో ఇక విషయాన్ని రేపు ప్రకటించండి.
SS రాజమౌళి ”డీల్ ఓకే ఆయితే నువ్వు పంచ్ లు వేసినందుకు గాను జరిమానాగా మీ ఫస్ట్ లుక్ విడుదలను ఆలస్యం చేయాలని నిర్ణయించుకున్నాను..
అని చాటింగ్ ను ముగించారు. ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.