‘ఆచార్య’ పరాజయం తర్వాత, దర్శకుడు కొరటాల శివ ‘దేవర: పార్ట్ 1’ సినిమాతో భారీ విజయం సాధించారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా 2024 లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కానీ ఈ విజయం వచ్చినప్పటికీ, కొరటాల శివ ఇప్పటివరకు తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రారంభించలేదు. ప్రస్తుతం ఆయన ‘దేవర 2’ పై పనిచేస్తున్నప్పటికీ, ఎన్టీఆర్ మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
Also Read : Vishvambhara : మొత్తానికి ‘విశ్వంభర’ పై మౌనం వీడిన దర్శకుడు వశిష్ట..
బాలీవుడ్ లో ఆయన నటించిన ‘వార్ 2’ ఆగస్టు 14న విడుదల కానుండగా, అదే సమయంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా షూటింగ్‌ను కూడా తారక్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దీని తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో పౌరాణిక చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. ఈ నేపధ్యంలో ‘దేవర 2’ సెట్స్ పైకి రావడానికి కాస్త ఆలస్యం అవుతుందని స్పష్టంగా తెలుస్తోంది. నిర్మాత కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చిత్రం పూర్తయిన తర్వాతే ‘దేవర 2’ మొదలవుతుందని స్పష్టం చేశారు. అలా అని కొరటాల శివ మరో కథానాయకుడితో సినిమా చేయాలని ప్లాన్ చేసిన.. ప్రజంట్ స్టార్ హీరోలందరూ ఇప్పటికే తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ, నాని వంటి యువ హీరోలు ఇతర సినిమాలతో కమిట్‌మెంట్‌లో ఉన్నారు. ఇక చిన్న హీరోలతో సినిమా చేయడానికి కొరటాల ఆసక్తి చూపడం లేదని టాక్. ఈ పరిస్థితుల నేపథ్యంలో, కొరటాల శివ తన తదుపరి సినిమా కోసం మరికొంత కాలం ఎదురు చూడాల్సిందే అని స్పష్టంగా అర్థమవుతుంది.