Sharwanand-Bhogi: ఒత్తిడి, భయం లేవు.. అందర్నీ సంతృప్తిపరుస్తా.. ‘భోగి’పై శర్వా ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharwanand about Bhogi Movie: టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించారు. కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో డస్కీ బ్యూటీ డింపుల్ హయాతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 27న ‘భోగి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలో హీరో శర్వానంద్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సాధారణంగా ప్రతి సినిమా విడుదలకు ముందు కొంత ఒత్తిడి ఉంటుందని.. అయితే భోగి విషయంలో తనకు ఎలాంటి ఒత్తిడి, భయం లేవని స్పష్టం చేశారు. సినిమా ఫస్ట్ కాపీ చూసినప్పుడే ఎంతో సంతృప్తి కలిగిందని, ప్రేక్షకులను కూడా తప్పకుండా సంతృప్తిపరుస్తాననే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాతో నటుడిగా తనలోని మరో కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న దర్శకుడు సంపత్ నందికి శర్వానంద్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. భోగి తన కెరీర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
- Ajith-MS Dhoni: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు 'తలా'లు.. మధ్యలో సూపర్ స్టార్.. పిక్స్ అదిరిపోలా!
- Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
- Sampath Nandi: శర్వానంద్‌కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
- Bheems: భోగి సినిమా హిట్ కాకపోతే నా పేరు మార్చుకుంటా.. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సంచలన శపథం!
భోగి చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా, చంద్రబోస్ పాటలకు సాహిత్యం సమకూర్చారు. దిలీప్ సుబ్బరాయన్ ఫైట్స్ సినిమాకు ఆకర్షణగా నిలుస్తాయని శర్వానంద్ తెలిపారు. అలాగే కిరణ్ ఆర్ట్ వర్క్ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే విడుదల తేదీ దగ్గరపడటంతో భోగిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రీ రిలీజ్ వేడుకలో సంపత్ నంది, శర్వానంద్, రాధామోహన్, డింపుల్ హయాతి, భీమ్స్ సిసిరోలియో, చంద్రబోస్ తదితర పాల్గొన్నారు.
- Tags
- Bhogi
- Sampath Nandi
- Sharwanand
తాజావార్తలు
-
Sharwanand-Bhogi: ఒత్తిడి, భయం లేవు.. అందర్నీ సంతృప్తిపరుస్తా.. ‘భోగి’పై శర్వా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bisleri Water: మీరు తాగే బిస్లరీ వాటర్ సురక్షితమేనా? షాకింగ్ విషయాలు వెల్లడించిన FSSAI..
-
INDA vs PAKA: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Koti Deepotsavam 2026: గరికిపాటి ప్రవచనం, ఏకామ్రేశ్వరస్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..!
-
Ajith-MS Dhoni: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు ‘తలా’లు.. మధ్యలో సూపర్ స్టార్.. పిక్స్ అదిరిపోలా!
ట్రెండింగ్
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India A vs Pakistan A: భారత్‌కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..