Bhogi Pre-Release Event Cancelled: చివరి నిమిషంలో ‘భోగి’ ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. 

Sharwanand Bhogi

Sharwanand Bhogi

Bhogi Pre-Release Event Cancelled: చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌పై ఊహించని న్యూస్ వైరల్ అవుతోంది. మరికొద్ది సేపట్లో అట్టహాసంగా ప్రారంభం కావాల్సిన ఈ వేడుక అనివార్య కారణాల వల్ల హఠాత్తుగా రద్దయింది. రిలీజ్ ముంగిట సర్వం సిద్ధమై, ఫ్యాన్స్ భారీగా తరలివస్తున్న తరుణంలో చివరి నిమిషంలో ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో శర్వా అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈరోజు ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే చివరి క్షణంలో ఈవెంట్‌ను రద్దు చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో మేకర్స్ ఈవెంట్ క్యాన్సిల్ విషయంపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తుంది.

ఈ చిత్రంలో శర్వానంద్ మునుపెన్నడూ చూడని అత్యంత పవర్‌ఫుల్ మాస్ రోల్‌లో కనిపించబోతున్నారు. 1960ల నాటి ఉత్తర తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఒక ఊరి బ్యాక్‌డ్రాప్‌లో ఈ పీరియడ్ కథ నడుస్తుంది. ఇందులో శర్వానంద్ ‘గంగా’ అనే ఇంటెన్స్ పాత్రలో కనిపించి తన నటనతో థియేటర్లలో పూనకాలు తెప్పించనున్నారు. పీరియడ్ సెటప్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, అణచివేతకు వ్యతిరేకంగా సాగే కథ ఈ సినిమాకు ప్రధాన బలం. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ ఏమాత్రం రాజీ పడకుండా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. మాస్ మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఇప్పటికే సినిమాపై హైప్ పెంచేశాయి. వాస్తవానికి ఈ సినిమాను ఆగస్టు 28నే విడుదల చేయాలనుకున్నప్పటికీ, 1960ల నాటి వాతావరణాన్ని సహజంగా చూపించేందుకు అవసరమైన భారీ వీఎఫ్ఎక్స్ పనుల కోసం ఆలస్యమైంది. క్వాలిటీ విషయంలో వెనక్కి తగ్గకుండా పనులన్నీ పూర్తి చేసుకుని, ఫైనల్‌గా నవంబర్ 12న పాన్-ఇండియా స్థాయిలో విడుదలయ్యేందుకు ‘భోగి’ సిద్ధమైంది. తాజా ఈవెంట్ రద్దు కావడం ఫ్యాన్స్‌ను కాస్త నిరాశపరిచినా, వెండితెరపై శర్వానంద్ విధ్వంసం చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.