ఇప్పటి పరిస్థితుల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన సినిమాలు భాషను మించిన ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘యుగానికి ఒక్కడు’. దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తి కథానాయకుడిగా నటించిన ఈ మూవీ, తమిళంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ తెలుగులో మాత్రం మంచి విజయం అందుకుంది. అయితే తాజాగా ఈ మూవీ రీ-రిలీజ్ సందర్భంగా వచ్చిన ప్రశంసల పట్ల కూడా రాఘవన్ స్పందించారు. “ఇప్పుడు చప్పట్లు కొటి ఏం లాభం?” అని ఆయన వ్యాఖ్యానించారు..
Also Read : Rajinikanth : అలాంటి సినిమాలకు గుడ్‌బై చెప్పిన సూపర్ స్టార్..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ ఈ సినిమా విడుదల సమయంలో వచ్చిన నెగిటివ్ రివ్యూలు నను చాలా బాధ పెట్టాయి. ఆ సమయంలో పెట్టిన డబ్బు, సమయం వృధా అయ్యిందని అనిపించింది. ఇప్పుడు ప్రేక్షకులు చూసి ఆనందిస్తున్న, ఆ సమయంలో సంబరాలు జరగకపోవడం వల్ల సంతోషం పొందలేక పోతున్నాను” అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు దర్శకుడి నిజమైన ఫీలింగ్‌ను ప్రతిబింబిస్తున్నాయి.
ఇక ఈ మూవీకి సీక్వెల్ కూడా ఎప్పుడు వస్తుంది? అని అడగ్గా.. ‘ ‘యుగానికి ఒక్కడు 2’ ప్రకటన చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే కార్తి లేకుండా అసలు సీక్వెల్ సాధ్యం కాదు. సినిమాకు భారీ బడ్జెట్ అవసరం, హీరో కనీసం ఏడాది పాటు కాల్షీట్ ఇస్తే కానీ, సినిమా పూర్తి చేయడం సాధ్యం కాదు. ప్రజంట్ బడ్జెట్ ఏమాత్రం సమస్య కాదు, వీఎఫ్‌ఎక్స్‌కు కూడా తక్కువ ఖర్చే అవుతుంది. అయితే, ఏఐ యుగంలో ఇలాంటి ప్రాజెక్ట్ చేయడం అంత సులభం కాదూ. కానీ దేనికైనా సమయం వస్తుంది. దీని వదిలేస్తా అని మాత్రం చెప్పడం లేదు’ అని పేర్కొన్నారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.