Sekhar Basha Attacked My Private Parts Says Lavanya: లావణ్య, రాజ్ తరుణ్ వివాదంలో శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాజ్ తరుణ్ పేరు పక్కకు వెళ్లి ఎక్కువగా శేఖర్ బాషా పేరు వినిపిస్తోంది. తనను తాను రాజ్ తరుణ్ స్నేహితుడిగా చెప్పుకున్న శేఖర్ బాషా అనే ఒక రేడియో జాకీ లావణ్యకు వ్యతిరేకంగా ఉన్న అనేక సాక్షాలను తెరమీదకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో వీరిద్దరూ ఒకరి మీద ఒకరు పరస్పరం దాడి చేసుకున్నట్టు తెలుస్తోంది. తనమీద శేఖర్ బాషా ఎటాక్ చేశాడని తనకు కడుపులో తీవ్రమైన గాయమైందని చెబుతూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. లావణ్య, శేఖర్ బాషా తనను కడుపులో తన్నాడని అలాగే వీపు భాగం మీద కూడా దాడి చేశాడని తన ప్రైవేట్ పార్ట్స్ మీద సైతం శేఖర్ భాషా దాడి చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Anchor Suma: సుమకి లైవ్ లో ఐలవ్యూ చెప్పిన నటుడు
పోలీసులు ఈ అంశం మీద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు లావణ్య శేఖర్ బాషా తన జీవితాన్ని అంతం చేస్తానని బెదిరిస్తున్నాడని తన ఇంటి మీద రాళ్లు వేయించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. లావణ్య తాను రాజ్ తరుణ్ గతంలో కలిసి ఉన్నామని ప్రేమ పేరుతో సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నాడని ఆరోపించింది. పలు సార్లు గర్భంధాలిస్తే ఇప్పుడే వద్దని చెప్పి అబార్షన్ కూడా రాజ్ తరుణ్ చేయించాడంటూ ఆరోపణలు చేసింది. అంతేకాదు మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ అఫైర్ నడుపుతున్నాడని కూడా ఆమె ఆరోపణలు చేసింది. కేవలం మాల్వి మల్హోత్రా మాత్రమే కాదు రాజ్ తరుణ్ చాలామంది హీరోయిన్స్ తో ఆమె అఫైర్స్ నడిపాడని కూడా ఆమె ఆరోపిస్తోంది.