ఈరోజుల్లో సినిమాల కన్నా కూడా వెబ్ సిరీస్ లకు క్రేజ్ ఎక్కువ.. స్టార్ హీరో, హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ‘సేవ్ ద టైగర్స్’ అనే కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వెబ్ సిరీస్ గత సంవత్సరం ఏప్రిల్ లో వచ్చి మంచి విజయం సాధించింది.. అన్ని ఎపిసోడ్స్ కూడా బాగా పాపులారిటిని సొంతం చేసుకున్నాయి.. ఇప్పుడు ‘సేవ్ ద టైగర్స్ 2’ రాబోతుంది.. ఈరోజు సీరిస్ కు సంబందించిన ట్రైలర్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు..
ఈరోజు సిరీస్ లో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని.. కపుల్స్ గా ప్రధాన పాత్రల్లో, శ్రీకాంత్ అయ్యంగార్, వేణు, రోహిణి.. మరికొంతమంది ముఖ్య పాత్రల్లో మహి వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి నిర్మాణంలో తేజ కాకుమాను దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది.. ఇప్పుడు సిరీస్ 2 రాబోతుంది..
గత ఏడాది వచ్చిన సీజన్ 1 సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు సీజన్ ను కొద్ది రోజుల్లో రిలీజ్ చెయ్యనున్నారు.. త్వరలోనే మార్చ్ 15 నుంచి సేవ్ ద టైగర్స్ సీజన్ 2 డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సేవ్ ద టైగర్స్ 2 ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో ఫుల్ కామెడీతో నవ్వించారు. దీంతో ఈసారి కూడా సేవ్ ద టైగర్స్ 2 సిరీస్ ఫుల్ గా ప్రేక్షకులని నవ్వించబోతున్నట్లు తెలుస్తుంది.. ఈరోజు సిరీస్ లో రన్ రాజా రన్ హీరోయిన్ సీరత్ కపూర్ కూడా నటిస్తుంది..