Rao Bahadur Teaser: లాస్ట్‌లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rao Bahadur Teaser: వైవిధ్యమైన పాత్రలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరో సత్యదేవ్ (Satya Dev) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రావు బహదూర్’ (Rao Bahadur Teaser). జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ గమనిస్తే.. ఇదొక విభిన్నమైన – ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నట్లు స్పష్టమవుతోంది. సత్యదేవ్ తన లుక్ – నటనతో మరోసారి ఆకట్టుకునున్నారు.
ఒక పెద్ద భవనం (భువనాలయము), అందులో జరిగే విచిత్రమైన పరిణామాలు, ఒక వైపు కామెడీగా కనిపిస్తూనే మరోవైపు మిస్టరీని క్రియేట్ చేసేలా టీజర్ కట్ చేసిన తీరు ఆకట్టుకుంటోంది. ఇందులో సత్యదేవ్ రామప్ప అనే పాత్రలో కనిపించనున్నారు.‘జీవితం సంకనాకిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ శక్తులు సిద్ధిస్తాయి’ అంటూ చివర్లో సత్యదేవ్ చెప్పే డైలాగ్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. టీజర్‌లోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయి. ఈ చిత్రం జూలై 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రావు బహదూర్’ సినిమాతో సత్యదేవ్, వెంకటేష్ మహా కాంబినేషన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!