Sattamum Needhiyum: ‘సట్టముం నీతియుం’ సిరీస్‌కి సూపర్ రెస్పాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శరవణన్ ప్రధాన పాత్రలో నటించిన ‘సట్టముం నీతియుం’ సిరీస్‌ను ZEE5 తెలుగు ప్రేక్షకులకు అందించింది. 18 క్రియేటర్స్ బ్యానర్ మీద ఈ సిరీస్‌ను శశికళ ప్రభాకరణ్ నిర్మించారు. షో రన్నర్‌గా సూర్య ప్రతాప్. ఎస్ వ్యవహరించారు. బాలాజీ సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ తెలుగులో రీసెంట్గా స్ట్రీమింగ్ అయి మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ‘సట్టముమ్ నీతియుమ్’ సక్సెస్ మీట్‌ను మంగళవారం ఘనంగా నిర్వహించారు.
Also Read
శశికళ మాట్లాడుతూ .. ‘నిర్మాతగా ఇలా స్టేజ్ మీద మాట్లాడుతుండటం కొత్తగా ఉంది. యాంకర్‌గా ఎన్నో సార్లు మైక్ పట్టుకున్నా కూడా ఈ రోజు ఇలా కొత్తగా అనిపిస్తోంది. ఇదంతా కూడా నా భర్త ప్రభాకరణ్ వల్లే సాధ్యమైంది. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్‌ను ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్. తెలుగులోనూ ఈ సిరీస్ అద్భుతంగా దూసుకుపోతోంది. ఈ సిరీస్‌కు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. బాలాజీ గారు ఈ సిరీస్‌ను కేవలం 13 రోజుల్లోనే పూర్తి చేశారు. ఆయన వల్లే ఈ సిరీస్ ఇంత అద్భుతంగా వచ్చింది. ఆర్ట్ డైరెక్టర్ భావన మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. శరవణన్ సర్ ఈ సిరీస్‌కు బ్యాక్ బోన్‌లా నిల్చున్నారు. నమ్రత ప్రస్తుతం చాలా బిజీగా మారిపోయారు. ఈ సిరీస్‌లో అందరూ అద్భుతంగా నటించారు. నా భర్త ప్రభాకరణ్‌కు సిరీస్‌లు, సినిమాల పట్ల ఎంతో ప్యాషన్ ఉంటుంది. ఆయనకు ఈ ప్రాజెక్ట్ చాలా ప్రత్యేకం. ఈ సిరీస్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!