“సర్కారు వారి పాట” చిత్ర నిర్మాతలు రీసెంట్ గా ఫస్ట్ నోటీసు అంటూ సినిమా నుంచి మహేష్ బాబు లుక్ ను విడుదల చేశారు. పొడవాటి జుట్టుతో, ఖరీదైన ఎరుపు రంగు కారులో మహేష్ బాబు కన్పించిన పోస్టర్ అభిమానుల అంచనాలను పెంచింది. “సర్కారు వారి పాట” ఫస్ట్ నోటీసు పోస్టర్ లో ముగ్గురు బైకర్‌లు కన్పించడం ఆసక్తిని రేకెత్తించింది. ఈ పోస్టర్ ద్వారానే మేకర్స్ జనవరి 13న సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అంటే సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్లకు వస్తుంది. “సర్కారు వారి పాట” ఫస్ట్ నోటీసు ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
Read Also : కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన “ఇస్మార్ట్” బ్యూటీ
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ లుక్ తోనే అత్యంత వేగంగా 100కే లైక్‌లను పొందిన ఏకైన చిత్రంగా “సర్కారు వారి పాట” కొత్త రికార్డును సృష్టించింది. ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదలవుతుందని అంటున్నారు.మరి ఆ టీజర్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. “సర్కారు వారి పాట”కు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. దీనికి థమన్ సంగీతం అందించారు. కె. వెంకటేశ్ ఎడిటర్ కాగా, ఎఎస్ ప్రకాష్ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్.