Sardar 2: ‘స్పైడర్’లో మిస్సైన మ్యాజిక్ ఇందులో రిపీట్.. కార్తి షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో కార్తి నటించిన కోలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సర్దార్’ కు సీక్వెల్ గా వస్తున్న ‘సర్దార్ 2’ (Sardar 2) చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తమిళంతో పాటు తెలుగులోనూ అనూహ్య విజయం సాధించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కు సీక్వెల్ గా రాబోతున్న ఈ మూవీ సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హీరో కార్తి సినిమాకు సంబంధించిన పలు సంచలన విషయాలను పంచుకున్నారు.
తొలిభాగంలో వాటర్ మాఫియా కాన్సెప్ట్ ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అయిందో, ‘సర్దార్ 2’ కాన్సెప్ట్ దానికి పదిరెట్లు ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని కార్తి ధీమా వ్యక్తం చేశారు. “ఇండియాలో స్పై సినిమాలు చాలా తక్కువ. ఒక లుంగీ కట్టుకున్న గూఢచారి కథ అనగానే నేను వెంటనే కనెక్ట్ అయ్యాను. రవీంద్ర కౌశిక్ లాంటి రియల్ లైఫ్ స్పైలు మన మధ్యే సాధారణంగా ఎలా ఉంటారో ఇందులో చూపించాం. తొలిభాగంలో దేశం కోసం ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్ ని ఎలా త్యాగం చేశాడో చూశారు. ఇప్పుడు ‘సర్దార్’ ఎందుకు తిరిగి వచ్చాడనేది చాలా గొప్ప పాయింట్ తో డైరెక్టర్ పీఎస్ మిత్రన్ డిజైన్ చేశాడు” అని కార్తి తెలిపారు.
Also Read
- Sekhar Master: నా పుట్టు పూర్వోత్తరాలపై నిందలేస్తారా? జానీ మాస్టర్ భార్య బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే
- Ee Paata Korinavaaru : ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత పొడవైన టైటిల్
- Chadalavada :కొండపైన వెంకన్న సన్నిధిలా.. టీ నగర్లో అన్నగారి ఇల్లు
- C Kalyan : కోట్ల రూపాయల నిర్మాతల సొమ్ము ఎవరు అనుభవిస్తున్నారో అందరికీ తెలుసు
‘సర్దార్ 2’లో ఎస్.జె. సూర్య పోషిస్తున్న విలన్ పాత్ర సరికొత్త డైమెన్షన్లో ఉండబోతోందని కార్తి రివీల్ చేశారు. ముఖ్యంగా మహేష్ బాబు ‘స్పైడర్’ సినిమాలో సూర్య చేసిన విలనిజం ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ విషయంపై ప్రస్తావిస్తూ.. “స్పైడర్ లో ఏది మిస్ అయిందో, అది ఈ సర్దార్ 2లో వర్కౌట్ అయిందని సూర్య గారే స్వయంగా చెప్పారు. ఆయన తన క్యారెక్టర్ కు స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు” అని కార్తి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
హాలీవుడ్ తరహాలో స్పై సినిమాలు సాధారణంగా విదేశాల్లో జరుగుతుంటాయని, కానీ సర్దార్ 2 మాత్రం ఇండియాలో జరుగుతున్న ఒక ప్రాబ్లమ్ ను గూఢచారి ఎలా హ్యాండిల్ చేశాడనే పాయింట్ తో నడుస్తుందని కార్తి చెప్పారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయని, ముఖ్యంగా ఒక ఓల్డ్ మ్యాన్ గా ఫైట్స్ చేయడం తనకెంతో ఛాలెంజింగ్ గా అనిపించిందని అన్నారు. హై ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఏకంగా ఒక వందే భారత్ ట్రైన్ సెట్ ను వేసినట్లు ఆయన వెల్లడించారు.
ఆశిక రంగనాథన్, మాళవిక మోహనన్ పాత్రలు రెగ్యులర్ హీరోయిన్లలా కాకుండా చాలా స్ట్రాంగ్ అండ్ ఇంటెలిజెంట్ గా ఉంటాయని కార్తి స్పష్టం చేశారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నాగార్జున కు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తెలుగులో విడుదల చేస్తుండటం విశేషం. ఈ సినిమాను ఎంజాయ్ చేయాలంటే యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉన్న మొదటి భాగాన్ని (సర్దార్) మరోసారి చూసి థియేటర్లకు రావాలని కార్తి ప్రేక్షకులకు సూచించారు.
తాజావార్తలు
-
Sardar 2: ‘స్పైడర్’లో మిస్సైన మ్యాజిక్ ఇందులో రిపీట్.. కార్తి షాకింగ్ కామెంట్స్!
-
Secunderabad Army : ఆర్మీ ఆయుధాల మిస్సింగ్ కేసు.. ఐదు రోజులు గడిచినా మిస్టరీనే.!
-
Moscow: యుద్ధం ముగింపు దిశగా అడుగులు.. మాస్కోలో ట్రంప్ దూతలు చర్చలు.. పుతిన్ మెత్తబడతారా?
-
Jhiram Ghati Maoist Attack: ‘‘జీరాం ఘాటి’’ కాంగ్రెస్ నేతల దారుణహత్య.. 10 మంది దోషుల నిర్ధారణ..
-
Sekhar Master: నా పుట్టు పూర్వోత్తరాలపై నిందలేస్తారా? జానీ మాస్టర్ భార్య బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!