Sara Arjun: ‘ధురంధర్’ బ్యూటీకి బంపర్ ఆఫర్.. లెజెండరీ నటి బయోపిక్‌లో ఛాన్స్!
- త్వరలో వెండితెరపై మధుబాల జీవిత చరిత్ర
- మధుబాల బయోపిక్‌లో సారాకు ఛాన్స్
- సారా అయితేనే పూర్తి న్యాయం చేయగలదని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ వెండితెర దిగ్గజం మధుబాల జీవిత చరిత్ర త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌లో మధుబాల పాత్రను పోషించే అరుదైన అవకాశాన్ని యువ నటి సారా అర్జున్ దక్కించుకుంది. ఇటీవల వచ్చిన ‘ధురంధర్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సారా.. ఇప్పుడు ఈ ఐకానిక్ పాత్రతో తన కెరీర్‌లో మరో మెట్టు ఎక్కబోతోంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తుండటం విశేషం. ‘డార్లింగ్స్’ సినిమాతో తన ప్రతిభను చాటుకున్న జస్మీత్ కె. రీన్ ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నారు. భన్సాలీ చిత్రాలంటేనే ఉండే ఆ లార్జర్ ద్యాన్ లైఫ్ మేకింగ్ ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
సారా అర్జున్ ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకం. చిన్న వయసులోనే టీవీ ప్రకటనలతో కెరీర్ ప్రారంభించిన సారా.. ఆరేళ్ల వయసులో చియాన్ విక్రమ్ సరసన ‘నాన్న’ చిత్రంలో బాలనటిగా నటించి అందరి హృదయాలను గెలుచుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆమె.. ఇటీవల హీరోయిన్‌గా ‘ధురంధర్’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది. మధుబాల బయోపిక్ కోసం తొలుత పరిశ్రమలోని పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లను చిత్ర బృందం పరిశీలించింది. అయితే మధుబాలలోని ఆ అమాయకత్వం, తీక్షణతను ప్రతిబింబించడంలో సారా అయితేనే పూర్తి న్యాయం చేయగలదని నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ భావించారని తెలుస్తోంది. సారా స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాత్రకు ప్రధాన బలం కానుంది.
Also Read
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈ ఏడాది చివరలో సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది. ‘ధురంధర్’లో తన నటనతో మెప్పించిన సారా అర్జున్.. ఇప్పుడు లెజెండరీ నటి మధుబాలగా ఎలా మెప్పిస్తుందో చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది.
తాజావార్తలు
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!