సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్లో తీర్థ క్రియేషన్స్ బ్యానర్ మీద సంధ్య తిరువీధుల నిర్మాతగా పార్ద సారథి కొమ్మోజు తెరకెక్కించిన చిత్రం ‘సందిగ్ధం’. ఈ చిత్రంలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ దేవ్, కాజల్ తివారి, జీవ కోచెర్ల, నవీన్ రాజ్, చిట్టిబాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు, నాగి వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ క్రమంలో ‘సందిగ్ధం’ టీజర్‌ను నటుడు, నిర్మాత అశోక్ కుమార్ శుక్రవారం నాడు రిలీజ్ చేశారు. ‘సందిగ్ధం’ టీజర్ గమనిస్తే.. ఓ ఊరు, అందులో జరిగే వింత ఘటనలు, ప్రేమ కథ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఇందులో చూపించిన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ ఎంతో సహజంగా కనిపిస్తున్నాయి. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌కి సరిపోయే మంచి ఆర్ఆర్ కూడా ఉంది. టీజర్‌తో సినిమా మీద మంచి బజ్‌ను అయితే క్రియేట్ చేశారు.