తెలుగు సినీ పరిశ్రమ నుంచి అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన ప్రతి సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తూ, హీరోల ఇమేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్తోంది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ తీసి షాహిద్ కపూర్ కెరీర్ మలుపు తిప్పాడు. తాజాగా రన్‌బీర్ కపూర్ హీరోగా చేసిన ‘యానిమల్’ సినిమా కూడా దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో పాన్-వరల్డ్ లెవెల్‌లో మరోసారి తన సత్తా చాటుకునే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ..
Also Read : AA22xA6 : అల్లు అర్జున్–అట్లీ మూవీలోకి సీనియర్ హీరోయిన్ ఎంట్రీ..!
బాలీవుడ్ డైరెక్టర్స్ మన హీరోలకు సక్సెస్ ఇవ్వడంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు. ‘ఆది పురుష్’ సినిమాతో ఓం రౌత్ ప్రభాస్‌కి కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌ను ఇచ్చాడు. ‘జంజీర్’ సినిమాతో అపూర్వ లఖియా రామ్ చరణ్‌కి మరో నిరాశను మిగిల్చాడు. తాజాగా ‘War 2’లో కూడా ఎన్టీఆర్ అంచనాలకు తగిన స్థాయి హైప్ రాలేదని, అయాన్ ముఖర్జీ ఎక్స్‌పెరిమెంట్ పూర్తిగా ఫెయిల్ అయ్యిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మరో వైపు సందీప్ రెడ్డి వంగ మాత్రం బాలీవుడ్ హీరోలకు హిట్స్ ఇస్తూ, వారి మార్కెట్‌ను పెంచుతున్నాడు. ఈ లెక్కన ఆయన స్థాయికి పోటీ పడే స్థితిలో బాలీవుడ్ డైరెక్టర్స్ లేరని చాలా మంది సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.