టాలీవుడ్లోనే కాదూ శాండిల్ వుడ్లో కూడా భారీ ప్రాజెక్టులు వాయిదాల పర్వం మొదలు పెట్టేశాయి. ఇప్పటికే కేడీ ద డెవిల్ పాన్ ఇండియా ఫిల్మ్ పలుమార్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. శాండిల్ వుడ్ పాన్ ఇండియా బాట పట్టాక చెప్పిన టైంకి సినిమాలను తీసుకు వచ్చే పద్దతికి మంగళం పాడేసినట్లే కనిపిస్తోంది. ధ్రువ్ సర్జా హీరోగా వస్తోన్న పాన్ ఇండియా ఫిల్మ్ కెడీ ద డెవిల్. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఏప్రిల్ నుండి మేకి ఆపై ఆగస్టుకి ఇప్పుడు సెప్టెంబర్ బరిలో దిగనున్నట్లు టాక్. ఇప్పుడు కేడీ బాటలోనే నడుస్తోంది మల్టీస్టారరర్ మూవీ 45. శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి హీరోలుగా తెరకెక్కుతోన్న 45 పోస్ట్ పోన్ అయ్యింది.
Also Read : Mega Star : మెగా స్టార్ ప్లానింగ్ మాములుగా లేదు.. వచ్చే రెండేళ్లు రఫ్ఫాడించబోతున్నారుగా
యాక్షన్ ఫాంటసీ ఫిల్మ్ ’45’ ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. కానీ వార్2, కూలీ బిగ్ ఫైట్ నేపథ్యంలో వెనకడుగు వేసినట్టు కనిపిస్తోంది. కానీ లెటెస్ట్ సమాచారం ప్రకారం సీజీ వర్క్, వీఎఫ్ఎక్స్ ఇంకా ఫినీష్ కాలేదని మేకర్స్ చెబుతున్నారు. వీఎఫ్ఎక్స్ హాలీవుడ్ విదేశీ కంపెనీకి అప్పగించడంతోనే ఈ డిలే జరుగుతుందని వెల్లడించారు డైరెక్టర్ అర్జున్ జన్యా. క్రిస్మస్ బరిలో సినిమాను రిలీజ్ చేస్తామని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. మరి ఈ సారైనా చెప్పిన డేట్ కు వస్తారో లేక మరోసారి వాయిదా అంటారో చూడాలి. ఇక కేడీ ద డెవిల్కు అర్జున్ కంపోజర్ కాగా, 45తో ఫస్ట్ టైం మెగా ఫోన్ పడుతున్నాడు ఈ కన్నడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే బాణీలు సమకూర్చే బాధ్యతను తీసుకున్నాడు. దీంతో రెండు పడవలపై ప్రయాణం చేయలేక స్ట్రగుల్ పడుతున్నాడు. 45 డిలే అయ్యింది మరీ కేడీ ద డెవిలైన సెప్టెంబర్ బరిలో వస్తుందా లేదో ఇంకేన్ని రోజుల్లో తేలిపోతుంది