Samyuktha Menon : మహిళా దినోత్సవం.. ‘షార్ట్ ఫిలిం’ సమర్పించిన గోల్డెన్ లెగ్ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లైంగిక వేధింపులపై విప్లవాత్మకమైన వినూత్నమైన ప్రయత్నంగా “కీప్ ది ఫైర్ అలైవ్” అనే 1 నిమిషం 25 సెకండ్ల నిడివి ఉన్న ఓ షార్ట్ ఫిల్మ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది హీరోయిన్ సంయుక్త. అందరిని ఆలోచింప జేసే అద్భుతమైన దృశ్య కావ్యంగా యదార్థసంఘటనలపై స్పృహ కల్పించి, రేపటి తరాన్ని మేలుకొల్పేలా దీన్ని రూపొందించారు. అందుకే సంయుక్తను ఈ షార్ట్ ఫిల్మ్ ఆకర్షించింది. అందుకే కె ప్రఫుల్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ ను సంయుక్త ప్రెజెంట్ చేశారు. ఈ సందర్భంగా రచయిత దర్శకుడు కే ప్రఫుల్ చంద్ర మాట్లాడుతూ.. నిత్యం మన చుట్టూ జరిగే చాలా విషయాలు మన కోపానికి కారణం అవుతాయి. వాటిలో లైంగిక వేధింపులకు సంబంధించిన విషయాలు బాధతో పాటు కోపాన్ని కలిగిస్తాయి. వాటిని అధిగమించాలంటే కఠినమైన చట్టాలు తీసుకొస్తే సరిపోతుందా అంటే కచ్చితంగా కాదు. వీటి కన్నా స్పృహ అత్యంత ముఖ్యమైనది. మనందరం మనుషులం. ఎవరితో ఎలా ప్రవర్తించాలో మనకు తెలుసు. కానీ మారుతున్న కాలంతో పాటు మనం కొన్ని విలువలు మర్చిపోయాము. మళ్లీ మనుషులుగా మనమంతా ఒకే తాటిపై నిలబడితే ఎలాంటి అరాచకాలకు తావుండదు.
కచ్చితంగా రేపటి కోసం ఒక అడుగు అందరమూ వేయాలి. అప్పుడే మార్పు మొదలవుతుంది. భారతదేశానికి స్వతంత్రం కావాలి అని 1743లో మొదట కోరిన వ్యక్తి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని ఆస్వాదించలేదు కానీ ఆయన ఆశయం నెరవేరింది. అలాగే సమాజంలో మార్పు కోసం ఈరోజు మనము ఒక అడుగు వేయాలి. ఆ మార్పు ఫలాలు భవిష్యత్ తరాలు కచ్చితంగా అనుభవిస్తాయి. అనే పాయింట్ తో ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కించాము అన్నారు. ఇక సంయుక్త ఆదిశక్తి అనే ఫౌండేషన్ ను స్థాపించి మహిళా శక్తిని ప్రపంచానికి తెలియజేయాలని సంకల్పంతో అడుగులు వేస్తోంది. అందుకే మా షార్ట్ ఫిలిం సంయుక్త హృదయానికి అత్యంత చేరమైంది. కచ్చితంగా అందరూ కలిసి మార్పు కోసం ఒక అడుగు వేస్తే సమాజంలో స్త్రీలపై ఎలాంటి దాడులు జరగవు. మా షార్ట్ ఫిలిం కచ్చితంగా ఒక మేలుకొలుపు అని కె ప్రఫుల్ చంద్ర అన్నారు. ఇది కేవలం ప్రేక్షకులను అలరించే కథాంశం మాత్రమే కాదు మేల్కొల్పే సారాంశం. ఈ లఘు చిత్రంలో వాడిన ప్రతి సన్నివేశం ప్రతి మెటఫర్ సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. స్త్రీల సమస్యపై ప్రతి గొంతు మాట్లాడాలి. మౌనం సమాధానం కాకూడదు. సమాజంలో ఈ మార్పు తీసుకురావడానికే “కీప్ ది ఫైర్ అలైవ్” ముఖ్య ఉద్దేశం. అని ఆయన అన్నారు.
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!