Site icon NTV Telugu

Samyukta: పేరు మార్చుకున్న సంయుక్త?

Samyuktha

Samyuktha

హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భీమ్లా నాయక్ వంటి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత పలు అవకాశాలు అందుకుంది. ఒకవిధంగా ఆమెకు ఇప్పుడు లక్కీ హీరోయిన్ అనే పేరు సంపాదించింది. అందుకే ఆమెతో సినిమా చేయించేందుకు మన నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె డైరీ చాలా బిజీగా ఉంది.

Also Read:Kannappa: కన్నప్ప’పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఒకవైపు నందమూరి బాలకృష్ణతో అఖండ 2 చేస్తూనే, మరోవైపు స్వయంభు, అదేవిధంగా తమిళంలో బెంజ్, హైందవ, నారి నారి నడుమ మురారి అంటూ వరుస సినిమాలు చేస్తోంది. అయితే, ప్రస్తుతం ఆమె పేరు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే, తాజాగా ఆమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఇంకా ఫిక్స్ చేయలేని, కానీ దాదాపు బెగ్గర్ అనే టైటిల్ ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్న ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వెల్లడించారు.

Also Read:CM Chandrababu: వ్యర్థాల నుంచి సంపద సృష్టిపై సీఎం సమీక్ష.. 11 రంగాలపై ఫోకస్‌..

అయితే, ఈ అనౌన్స్‌మెంట్ సమయంలో ఆమె పేరును సంయుక్త మీనన్ అని కాకుండా సంయుక్త అని మీడియాకు సమాచారం ఇచ్చారు. ఇది మాత్రమే కాదు, గతంలో అఖండ 2 సమయంలో కూడా ఆమె పేరును సంయుక్త మీనన్ అని కాకుండా సంయుక్త అని సంప్రదించడంతో, ఆమె పేరు మార్చుకున్నారా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది.

Exit mobile version