సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బజార్ రౌడీ’. డి. వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ ఆలవలపాటి నిర్మాణ సారధిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, రెండు పాటలు విడుదలయ్యాయి. టీజర్ రెండు మిలియన్ వ్యూస్ దక్కగా రెండు పాటలకూ సూపర్ రెస్పాన్స్ వస్తోందని దర్శక నిర్మాతలు తెలిపారు. ‘నీవంటికి మెరుపులు బాగా చుట్టేశావే, నా కంటికి ఏవో రంగులు చూపించావే, పిల్లా నా మతి చెడగొట్టేశావే, వద్దన్నా నను పడగొట్టావే’ అంటూ సాగే రెండో పాటకూ విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. సంపూర్నేష్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్ చేసిన ఈ సినిమాకు సీనియర్ రైటర్ మరుధూరి రాజా రాసిన మాటలు హైలైట్ గా నిలువ బోతున్నాయని చెప్పారు. అలానే సీనియర్ ఎడిటర్ గౌతంరాజు, ఎ. విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు వర్క్ చేశారని అన్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. ఫ్యాక్టరీ సంగీతాన్ని సమకూర్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, కరోనా తీవ్రత తగ్గిన వెంటనే థియేటర్లలోనే ‘బజార్ రౌడీ’ని విడుదల చేస్తామని నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరావు అన్నారు.