‘హృదయ కాలేయం, కొబ్బరి మట్ట’ వంటి చిత్రాలతో క్రేజ్ సంపాదించుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “క్యాలీఫ్లవర్”. “శీలో రక్షతి రక్షితః” అనే ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు సరసన వాసంతి హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తుండగా, ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గూడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూధన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీప్ ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే “క్యాలీఫ్లవర్” చిత్రం నుంచి విడుదలైన సంపూర్ణేష్ లుక్ ఆకట్టుకోగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఆ ప్రకటనలో సినిమా షూటింగ్ పూర్తయినట్టుగా తెలిపారు. అంతేకాదు సంపూర్ణేష్ బాబుకు సంబంధించిన న్యూ లుక్ ను కూడా విడుదల చేశారు. చూడాలి మరి ఈ చిత్రంతో సంపూర్ణేష్ బాబు ఎంత కామెడీ పండిస్తాడో అనేది.
Read Also : 231 కిమీ నడిచి వచ్చిన ఫ్యాన్స్… అది తెలిసి చరణ్ ఇలా…!!