మ్యారేజ్ లైఫ్ బ్రేకైన తర్వాత.. హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడ్డ సమంత.. ఇక ఫుల్‌గా కెరీర్‌పై ఫోకస్ చేస్తుందనుకుంటే.. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరుతో కనిపిస్తూ.. డేటింగ్ వార్తలకు తెరలేపింది. రీసెంట్‌గా ఈ జంట ముంబయి వీధుల్లో పాపరాజీ కంటపడింది. ఇంకేముందీ మళ్లీ మ్యారేజ్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న గాసిప్స్ ఊపందుకున్నాయి. వీటికి ఆజ్యం పోసేలా సామ్ చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశమైంది.
Also Read:Dimple Hayathi: శారీలో చందమామలా.. డింపుల్ పిక్స్ చూడాల్సిందే!
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. రీసెంట్‌గా కొన్ని ఫోటోలు షేర్ చేసుకుంది. అందులో ఓ ఫోటోపై స్పెషల్ ఇంట్రస్ట్ చూపుతున్నారు నెటిజన్లు. అన్నింటిలో సామ్ చేతికి రింగ్ ఉన్న పిక్ హైలైట్ అవుతోంది. దీంతో మేడమ్ ఎంగేజ్‌మెంట్ చేసుకుందనే డౌట్ కాదు.. ఏకంగా ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్. ఇక త్వరలోనే రాజ్‌తో సెకండ్ లైఫ్ స్టార్ట్ చేయబోతుందన్న గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ఇదే టైంలో సామ్ ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తుందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Dimple Hayathi: శారీలో చందమామలా.. డింపుల్ పిక్స్ చూడాల్సిందే!
ఖుషీ తర్వాత బాలీవుడ్‌లో బిజీగా మారిన సమంత.. ట్రలాలాను ఏర్పాటు చేసి శుభంతో నిర్మాతగా తొలి సక్సెస్ అందుకుంది. ఇందులో ఓ చిన్న రోల్ చేసింది. ఇక గత ఏడాది ఎనౌన్స్ చేసిన మా ఇంటి బంగారం ఎంతవరకు వచ్చిందో నో అప్డేట్.. సిటాడెల్ తర్వాత రక్త బ్రహ్మాండ్ సిరీస్‌కు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సామ్.. తెలుగులో నందిని రెడ్డితో మూవీ ప్లాన్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. కానీ వీటి పిక్స్ కానీ అప్డేట్స్ కానీ లేవు. మేడమ్ కూడా సోషల్ మీడియాలో సినిమా కబుర్లు పంచుకోవడం లేదు. కానీ రాజ్‌తో కనిపిస్తూ ఏదో చెప్పాలని ట్రై చేస్తోంది. మరి సామ్ ఈ ఏడాది పర్సనల్ లైఫ్‌లో కొత్త స్టెప్ తీసుకోబోతుందా…? ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్ చెప్పనుందా..? మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంటరైతే… మూవీస్ మానేసి.. నిర్మాతగా కొనసాగుతుందా…? లెట్స్ సీ.. సమంత ఏం చేయబోతుందో..?
