Pappu Charu: పప్పుచారు ఇలా చేసారంటే.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pappu Charu: తెలుగు వారి చాలా ఇళ్లలో తినే వంటకాలలో ‘పప్పు చారు’ బాగా ఫేమస్. సాధారణంగా సాంబార్‌కి కొంచెం లైట్ వెర్షన్‌గా, తక్కువ మసాలాలతో తయారయ్యే ఈ పప్పు చారు అన్నంతో కలిపి తినడం ఎంత రుచిగా ఉంటుందో చెప్పక్కర్లేదు. మరి ఈ పప్పు చారును ఇంట్లో ఎలా సులభంగా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అవసరమైన పదార్థాలు:
పప్పు కుక్కర్ కోసం:
* కందిపప్పు – 1 కప్పు
Also Read
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
* టమాటో – 1 (ముక్కలుగా కట్ చేయాలి)
* పచ్చి మిరపకాయలు – 4
* పసుపు – 1/2 స్పూన్
* నీరు – అవసరమైనంత
Nitin Gadkari: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను కొనియాడిన నితిన్ గడ్కరీ..
చారు కోసం:
* ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
* టమాటో – 1 (సన్నగా తరిగినది)
* పచ్చిమిరపకాయలు – 2
* ఇంగువ – 1 చిటికెడు.
* చింతపండు – నిమ్మకాయ సైజు (నీటిలో నానబెట్టినది)
* కొద్దిగా కొత్తిమీర
* ఉప్పు – రుచికి తగినంత
* నీరు – 2-3 కప్పులు
పోపు కోసం:
* నెయ్యి లేదా నూనె – 1 టేబుల్ స్పూన్
* ఆవాలు – 1/2 స్పూన్
* మినప్పప్పు – 1/2 స్పూన్
* కరివేపాకు – కొద్దిగా
* ఎండు మిరపకాయలు – 2
* జీలకర్ర – 1/2 స్పూన్
* ఇంగువ – చిటికెడు.
Saina Nehwal: నెల క్రితమే విడాకులు.. శుభవార్త చెప్పిన సైనా నెహ్వాల్!
తయారీ విధానం:
పప్పుచారు కోసం ముందుగా కందిపప్పు ఉడికించాలి. ముందుగా కందిపప్పును కడిగి కుక్కర్‌లో వేసి టమాటో ముక్కలు, పసుపు, పచ్చిమిరపకాయలు వేసి 3 కప్పుల నీరు పోయాలి. అలాగే 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్‌లో ఉడకనివ్వాలి. కుక్కర్ చల్లారిన తర్వాత ఉడికిన పప్పును బాగా మెత్తగా ముద్దగా చేయాలి.
ఆ తర్వాత మరొక పెద్ద పాన్‌లో నెయ్యి లేదా నూనె వేసి పోపు వేసుకోవాలి. అందులోకి ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేయించాలి. ఆ తరువాత నానబెట్టిన చింతపండు రసం కలపాలి. నీరు కూడా పోసి మరిగించాలి.
ఆ తర్వాత మెత్తగా ముద్దగా చేసిన పప్పు వేసి కలపాలి. అందులోకి తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి మరిగించాలి. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అందులో మీకు ఇష్టమైతే ఇంగువ వేసుకోవచ్చు. ఇంకేముంది మీ ముందర రుచిని ఆస్వాదించడానికి పప్పుచారు రెడీ. ఈ పప్పు చారు వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యి కలిపితే ఆ టెస్ట్ వేరబ్బా. పక్కన ఒక్క ఫ్రై ఐటమ్ లేదా అప్పడముంటే చాలు ఒక పండుగ భోజనం రెడీ అంతే. ఇది పిల్లలకీ పెద్దలకూ చాలా నచ్చే సౌకర్యవంతమైన వంటకం.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?