Samantha: తల్లి కాబోతున్న సమంత?

Samantha Babybump Pic

Samantha Babybump Pic

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు జీవితంలో సరికొత్త వసంతం మొదలైనట్లు తెలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించి, సొంతంగా నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం నిన్న థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద దూసుకు పోతోంది. విడుదలైన కేవలం ఒక్క రోజులోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా క్లీన్ బ్రేక్ ఈవెన్ స్టేటస్ అందుకొని నిర్మాతగా సమంతకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ గ్రాండ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సామ్, ఈరోజు తన భర్త రాజ్ నిడిమోరు, చిత్ర యూనిట్‌తో కలిసి సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు.

అయితే, ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో కేవలం సినిమా హిట్ మాత్రమే కాదు, సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక క్రేజీ గుడ్ న్యూస్ కూడా నెట్టింట వైరల్‌గా మారింది. సక్సెస్ సెలబ్రేషన్స్ లో సమంత వైట్ కలర్ టీషర్ట్ ధరించి కనిపించారు. అందులో బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుండటంతో సామ్ ప్రెగ్నెంట్ అనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తమకు ఎంతో ఇష్టమైన హీరోయిన్ త్వరలోనే తల్లి కాబోతుందనే సంకేతాలు రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సమంతకు ఎప్పటి నుంచో ఒక అందమైన కుటుంబాన్ని ప్రారంభించాలనే బలమైన కోరిక ఉండేది. ఆ కల ఇప్పుడు నెరవేరబోతుండటంతో అటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సమంత, ప్రముఖ దర్శకుడు కమ్ ప్రొడ్యూసర్ రాజ్ నిడిమోరు గతేడాది డిసెంబర్‌లో వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. అయితే ఆమె ప్రెగ్నెన్సీ గురించి ఇప్పుడు జరుగుతున్నది అంతా ప్రచారమే అయినా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

×
×
Ad