Site icon NTV Telugu

Samantha: నవ్వేవాళ్ళు నవ్వనీ.. ఏడ్చేవాళ్ళు ఏడ్వనీ.. డోంట్ కేర్!

Samantha

Samantha

Samantha: ఈ మధ్యకాలంలో సమంత చేస్తున్న సినిమాల కంటే కూడా, ఎక్కువగా రాజ్ నిడుమోరుతో ఉన్న రిలేషన్ గురించే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఒకపక్క నాగచైతన్య, శోభితను వివాహం చేసుకున్న తర్వాత, సమంత, రాజ్ నిడుమోరుతో డేటింగ్ చేస్తోందన్న వార్తలు అనూహ్యంగా తెర మీదకు వచ్చాయి. ఈ విషయాన్ని సమంత సహా, రాజ్ నిడుమోరు ఎప్పుడూ ఖండించలేదు. దానికి తగ్గట్టుగానే, ఈమధ్య కాలంలో సమంత, ఆయనతో ఎక్కువగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇక తాజాగా ఒక ముంబై ఈవెంట్ ఫోటో అయితే, త్వరలోనే వీరిద్దరూ అధికారికంగా రిలేషన్‌లో ఉన్నట్లు అనౌన్స్ చేస్తారా, పెళ్ళికి అడుగులు వేస్తున్నారా అనే అనుమానాలు కలిగించేలా ఉంది.

Read Also: Actor Vishal: ఆ సమస్యను రాజకీయం చేయడం ఆపేయండి.. మీ కాళ్ళు మొక్కుతా!

రాజ్ నిడుమోరుని హగ్ చేసుకుని ఉన్నట్టుగా ఉన్న ఒక ఫోటోను, సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అంతేకాకుండా,
“స్నేహితులు, కుటుంబ సభ్యులతో చుట్టుముట్టబడి ఉన్నాను. గత ఏడాదిన్నర కాలంలో, నేను నా కెరీర్‌లో కొన్ని సాహసోపేతమైన అడుగులు వేశాను. రిస్క్‌లు తీసుకోవడం, నా అంతర్ దృష్టిని నమ్మడం మరియు నేను ముందుకు సాగుతున్నప్పుడు నేర్చుకోవడం. ఈ రోజు, నేను చిన్న విజయాలను జరుపుకుంటున్నాను. నేను కలిసిన అత్యంత తెలివైన, కష్టపడి పనిచేసే మరియు అత్యంత ప్రామాణికమైన వ్యక్తులతో కలిసి పనిచేయడం నాకు చాలా కృతజ్ఞతగా ఉంది. చాలా నమ్మకంతో, ఇది ప్రారంభం మాత్రమే అని నాకు తెలుసు,” అని సమంత పోస్ట్ చేసింది. మొత్తంగా చూసుకుంటే నవ్వేవాళ్ళు నవ్వనీ.. ఏడ్చేవాళ్ళు ఏడ్వనీ.. డోంట్ కేర్! అన్నట్టుగా సమంత తనకు నచ్చింది నచ్చినట్టు చేసుకు పోతోంది అనే చెప్పాలి.

Exit mobile version