తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే పేరు సమంత రూత్ ప్రభు. ఆమె కెరీర్, వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటుంది. గతంలో నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత, సమంత వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి తన కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టిన సమంత, నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన సత్తా చాటుతోంది. తాజాగా ఆమె నిర్మించిన ‘శుభం’ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
Also Read : Vijay Sethupati : డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై విజయ్ సేతుపతి సీరియస్!
ఇక మూవీస్ విషయం పక్కన పెడితే దక్షిణ భారత స్టైల్ మేకర్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరు తో సమంత ఈ మధ్య అత్యంత సన్నిహితంగా ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ టాపిక్. అయితే ఇటీవల సమంత భుజంపై రాజ్ చేయి వేసి నడవగా, మరో ఫొటోలో ఇద్దరు పక్కపక్కన కూర్చొని చాలా హ్యాపీ మూడ్‌లో కనిపించారు. కట్ చేస్తే ఈ జంట తాజాగా ఒకే కారులో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ఇది చూసిన తర్వాత కొందరు త్వరలోనే వారి రెండో పెళ్లి అంటూ జోస్యాలు చెబుతున్నారు. మరి కొందరు ‘ఇదంతా కేవలం ప్రొఫెషనల్ రాప్ కాదు.. వీళ్ల మధ్య ఏదో ఉంది” అంటూ, మరి కొంతమంది ‘త్వరలో వీరి రెండో పెళ్లి జరగబోతోందా?’ అని డైరెక్ట్‌గా ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వీరిద్దరిలో ఎవరూ దీనిపై స్పందించలేదు. ఇది నిజంగా వ్యక్తిగత సంబంధమా? లేక తమ ప్రాజెక్టుకు ఉన్న అనుబంధమా? అనేది మాత్రం అర్థం కాలేదు.