Samantha Name Following Naga Chaitanya: అదేంటి నాగచైతన్య ఎంగేజ్మెంట్ చేసుకుని రెండో వివాహానికి రెడీ అవుతున్న వేళ సమంత వదలక పోవడం ఏమిటి? అనే అనుమానం మీకు కలగవచ్చు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సమంత నాగచైతన్యను వదలకపోవడం కాదు సమంత అనే పదం నాగచైతన్యను వదలడం లేదు. గతంలో నాగచైతన్య హీరోయిన్ సమంతను ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత కొన్ని కారణాలతో వీళ్ళు అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు. తర్వాత నాగచైతన్య శోభితతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ కొద్ది రోజుల క్రితమే వారిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోవడం, దాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించడం అందరికీ తెలిసిందే.
Tollywood Heros: ‘పకోడీ’లపై పడ్డ టాలీవుడ్ హీరోలు
అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం తెర మీదకు వచ్చింది. అదేంటంటే నాగచైతన్య కాబోయే భార్య శోభిత చెల్లెలి పేరు సమంత. ఆమె డాక్టర్ కోర్స్ చదివి ప్రస్తుతం డాక్టర్ గా పనిచేస్తుంది. మొదటి భార్య పేరే కాబోతున్న భార్య చెల్లెలి పేరు కూడా కావడమే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. నిజానికి ఇది యాదృచ్ఛికమే అయినా సమంత మాత్రం నాగచైతన్య నేను వదలడం లేదు అనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇక నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల వైవాహిక జీవితం గురించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ విషయం మీద నెటిజన్లు సైతం వేణు స్వామి మీద దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శుభం పలకరా అంటే త్వరలోనే విడిపోతారు అంటూ వేణు స్వామి చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.