Tollywood Heros Raviteja – Ram Pothineni Comments on Pakodi: అదేంటి తెలుగు హీరోలు పకోడీల చుట్టూ తిరగడం ఏమిటి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ టాప్ హీరోలు ఇద్దరి నోళ్ళ నుంచి ఈ పకోడీల ప్రస్తావన వచ్చింద. అయితే తినే పకోడీ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. తమకు నచ్చని వాళ్ళని ఉద్దేశిస్తూ పకోడీగాళ్లు అంటూ ఒకపక్క మాస్ మహారాజా రవితేజతో పాటు మరోపక్క ఎనర్జిటిక్ హీరో రామ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే రవితేజ మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో రామ్ డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆగస్టు 15వ తేదీన వీరి సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. ముందుగా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా ట్రైలర్ లో రవితేజ తనదైన శైలిలో మాస్ డైలాగులతో రెచ్చిపోయాడు.
Tollywood: హమ్మయ్య.. ఆ సినిమాకు ఇక టెన్షన్ తీరిపోయినట్టే..
చాలా మంది భయపడేది సమస్యలకు కాదు పుకార్లకు, రూమర్లకు పని పాట లేని చాలామంది పకోడీగాళ్లు ఇదే పని మీద ఉంటారు అంటూ డైలాగ్ పేల్చాడు. వాస్తవానికి ఈ డైలాగుని హరీష్ శంకర్ పలికించాడు. ఇది కావాలనే కొందరిని ఉద్దేశించి పెట్టిన డైలాగ్ ఏనా అని అడిగితే దాన్ని తన కాంప్లిమెంట్ గా తీసుకుంటాను అంటూ సరైన సమాధానం ఇవ్వకుండానే మరో ప్రశ్నకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు హీరో రామ్ కూడా తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇదే రకమైన పకోడీ కామెంట్స్ చేశాడు. సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఈ మధ్య ఒక కొత్త ట్రెండు చూస్తున్నానని వాళ్లు వీళ్లు అంటే పక్క వాళ్ళు అభిప్రాయాలు విని నిర్ణయానికి వస్తున్నారని చెప్పుకొచ్చాడు. మనకు నచ్చింది మనం చేయాలి కానీ పకోడీ గురించి పకోడీ గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవు అంటూ కామెంట్స్ చేశాడు. అంతే కాకుండా తాను సలహాలు ఇవ్వాలని అభిమానులు అందరూ తన మనుషులే అనిపించి ఈ మాట చెప్పానని చెప్పుకొచ్చాడు. దీంతో తెలుగు హీరోలు, పకోడీల చుట్టూనే కామెంట్స్ చేస్తూ ఉండడం మీద ప్రస్తుతం చర్చ జరుగుతోంది.