Salmaan Khan : ‘సికందర్’ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ భారీ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన సల్మాన్ గ్రాఫ్ గత కోది రోలుగా డౌన్లో ఉంది. ఈ సరి ఎలా అయిన తన అభిమానులను తృప్తిపరచడం కోసం ‘సికందర్’ మూవీతో వస్తున్నాడు . రష్మిక హీరోయిన్గా, దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు సల్మాన్. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి చాలా వార్తలు వైరల్ అవుతున్నప్పటికి..
మార్చి 30న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మామూలుగా సల్మాన్ తన సినిమాలు శుక్రవారం విడుదలయ్యేలా చూస్తాడు. కానీ ‘సికందర్’ మాత్రం ఆదివారం విడుదల చేయాలనే నిర్ణయం పట్ల కొంత ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రంజాన్ ఉపవాసాలు పూర్తయ్యే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆదివారం రిలీజ్ అనుకున్నారని టాక్. ఇదిలా ఉంటే ఈ మూవీ నుండి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకోగా..తాజాగా సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. కాగా ఈ ట్రైలర్‌ను మార్చి 23న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. మరిక ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకోవడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు. సల్మాన్ ఖాన్ నటన,యాక్షన్ సీన్స్ అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తుందని వారు చెబుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
PM Modi: చెప్పడమే కాదు.. చేసి చూపించారు.. పెట్రోల్ సేవ్ చేసేందుకు ‘కాన్వాయ్’ కట్ చేసిన ప్రధాని మోడీ!
-
Ban vs Pak: బంగ్లాదేశ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన పాకిస్థాన్..
-
Peddi :‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ విడియోతో సోషల్ మీడియా షేక్..!
-
Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం ‘క్లాడ్ ఫర్ లీగల్’ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
-
Kirrak Seetha: టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌పై.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!