సాయి పల్లవి ఏదైనా సినిమాకు సైన్ చేసిందంటే ఆడియెన్స్‌లో ఆ సినిమా హిట్ అనే సైన్ ఉంది. ఇప్పటి వరకు సాయి పల్లవి చేసిన సినిమాలు చూసుకుంటే సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏదైనా సినిమాకు లేడీ పవర్ స్టార్ ఓకె చెబితే చాలు ఆటోమేటిక్‌గా మంచి హైప్ వచ్చేస్తుంది. రీసెంట్‌గా అమరన్‌తో సాలిడ్ హిట్ కొట్టిన పల్లవి అందులో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ్’తో పాటు, తెలుగులో నాగ చైతన్య సరసన ‘తండేల్’ సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాల పై భారీ అంచనాలున్నాయి.
Also Read : SSMB : గుంటూరు కారం రీరిలీజ్.. టికెట్ ముక్క మిగలలేదు
లేటెస్ట్‌గా సాయి పల్లవి మరో తెలుగు ప్రాజెక్ట్‌కు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ‘బలగం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ వేణు ఎల్దండి. నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో రానున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. వేణు చెప్పిన కథ బాగా నచ్చడంతో సాయి పల్లవి వెంటనే ఓకే చెప్పేసిందట. అంతేకాదు డేట్స్ కూడా ఇచ్చేసిందట. ఎల్లమ్మ సినిమాను తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ప్లాన్ చేస్తున్నాడు వేణు. గతంలో సాయి పల్లవి చేసిన ‘పిధా’ సినిమా కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లోనే తెరకెక్కింది. కాబట్టి.. తెలంగాణ యాస, భాష పై సాయి పల్లవి మంచి పట్టు ఉందనే చెప్పాలి. మొత్తంగా.. ఎల్లమ్మగా సాయి పల్లవికి మరో అదిరిపోయే క్యారెక్టర్ పడినట్టే. అఫీషియల్ ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.