Sai Durgha Tej: పవన్ కల్యాణ్ బర్త్‌డే వేడుకల్లో సాయి దుర్గా తేజ్.. చిన్నారులతో కలిసి కేక్ కట్!

Sai Durgha Tej

Sai Durgha Tej

Sai Durgha Tej: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఘనంగా జరిగాయి. గోపాల్ నగర్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి హీరో సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా అభిమానులు, జనసేన కార్యకర్తలు, పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన సాయి దుర్గా తేజ్ అక్కడి చిన్నారులతో ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి కేక్ కట్ చేసి పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కూడా సాయి దుర్గా తేజ్ సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన.. రక్తదానం చేసేందుకు ముందుకొచ్చిన వారిని, రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు.

ఈ సందర్భంగా హీరో సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ.. రక్తదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను కేవలం అభిమానుల సంబరాలకే పరిమితం చేయకుండా సామాజిక సేవతో ముడిపెట్టడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు.