Sai DharamTej : మంచి మనసు చాటుకున్న సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్..
- విజయవాడలో సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్
- ఏపీ - టీజీ సీఎం రిలీఫ్ ఫండ్ కు వరద సాయం
- అమ్మ ఆశ్రమానికి సొంత భవనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్. ఎన్నో సందర్భాల్లో ఛారిటీ కార్యక్రమాలు చేసి తన మంచి మనసు చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడిన తెలుగు ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా 20 లక్షల రూపాయల విరాళాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు. తాజాగా ఆయన విజయవాడలో పర్యటించి అమ్మ అనాథాశ్రమానికి తన విరాళం అందజేశారు.
Also Read : DevaraTrailer : దేవర.. రికార్డుల జాతర.. ఇప్పటికి ఎన్ని మిలియన్ వ్యూస్ అంటే..?
Also Read
- Rudravanam PS: మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి ‘రుద్రవనం పీఎస్’ స్ట్రీమింగ్.!
- Pocket Rockets: నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘పాకెట్ రాకెట్స్’.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో యూత్‌ఫుల్ డ్రామా.!
- Sai Pallavi: "రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు".. లాస్ ఎంజెల్స్ వేదికగా సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు..
- Vishwak Sen: ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకో చెప్పిన విశ్వక్సేన్!
ఈ రోజు విజయవాడ చేరుకున్న సాయి దుర్గతేజ్ మొదట శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఆ తర్వాత అమ్మ అనాథాశ్రమానికి వెళ్లి అక్కడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అమ్మ అనాథశ్రమానికి 2 లక్షల రూపాయలు, ఇతర సేవా సంస్థలకు 3 లక్షల రూపాయల విరాళం అందించారు.
అమ్మ ఆశ్రమానికి సొంత భవనం కట్టిస్తానని 2019లో తన పుట్టినరోజున మాటిచ్చిన సాయి దుర్గతేజ్…చెప్పినట్లుగానే 2021లో బిల్డింగ్ కట్టించి ఇచ్చారు. మూడేళ్ల పాటు అమ్మ అనాథాశ్రమాన్ని దత్తత తీసుకుని మొత్తం ఖర్చులన్నీ భరించారు. సాయి దుర్గతేజ్ మంచి మనసుకు ఆశ్రమవాసులతో పాటు ప్రజలందరి ప్రశంసలు దక్కాయి. మేనమామ, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారి నుంచి సేవా గుణాన్ని పుణికిపుచ్చుకున్న సాయి దుర్గతేజ్ భవిష్యత్ లోనూ తనకు వీలైనంతగా సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజానికి తనవంతుగా అండగా నిలబడాలని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
ICC Rankings: జడేజా 1,683 రోజుల ఆధిపత్యానికి తెర.. నంబర్-1 ఆల్‌రౌండర్ స్థానాన్ని కోల్పోయిన జడ్డూ..
-
Nagpur MLC Election Result: నాగ్‌పూర్‌లో బీజేపీకి షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం! ఎవరీ అభిజీత్ వంజారీ?
-
Hyderabad: రేస్ క్లబ్ సమీపంలో భారీ పేకాట స్థావరం గుట్టురట్టు.. 12 మంది అరెస్ట్.!
-
US Fed Interest Rate Decision: అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం
-
Satish Jarkiholi: ఓటర్ల జాబితా నుంచి కోటి పేర్ల తొలగింపు సరైనదే.. కాంగ్రెస్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!