ఇండియాలో అగ్రగామి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ZEE5 ఈ వేసవిలో యాక్షన్, థ్రిల్లర్, కామెడీ జోనర్‌లతో కూడిన సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ZEE5లో స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ చిత్రం ‘రాబిన్ హుడ్’ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను సాధించి, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం మే 10న టెలివిజన్‌తో పాటు ZEE5లో ప్రీమియర్ అయింది. ట్రెండింగ్‌లో నిలిచి, టాప్ చార్ట్స్‌లో స్థానం సంపాదించిన ‘రాబిన్ హుడ్’ యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
Also Read:Snake-bite scam: ‘‘పాముకాటు కుంభకోణం’’.. 47 మందిని 280 సార్లు చంపారు..
‘రాబిన్ హుడ్’ కథలో రామ్ (నితిన్) ఒక తెలివైన అనాథ యువకుడు. కొన్ని పరిస్థితుల కారణంగా రాబిన్ హుడ్‌లా మారి, ధనవంతుల నుంచి డబ్బు దొంగిలించి, అవసరమైన వారికి సాయం చేస్తుంటాడు. అనుకోని విధంగా అతడు అంతర్జాతీయ డ్రగ్స్ సామ్రాజ్యానికి నాయకుడైన వ్యక్తితో తలపడాల్సి వస్తుంది. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తీసుకుంటుంది, ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఎలాంటి థ్రిల్‌ను అందిస్తుందనేది సినిమా యొక్క ఆసక్తికర అంశం.
Also Read: Kamal Haasan : నేను ద్రోణాచార్యుడిని కాదు, ఇంకా విద్యార్థినే
వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, షైన్ టామ్ చాకో, దేవ్ దత్త నాగె, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో స్పెషల్ క్యామియో పాత్రలో కనిపించి, వెండితెరపై తన ఎంట్రీని మార్క్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ‘రాబిన్ హుడ్’కు ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.