Peddi : ‘పెద్ది’ ట్రైలర్‌పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక తాజాగా ముంబై వేదికగా విడుదలైన ఈ సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డుల రచ్చ సృష్టిస్తూ, కేవలం కొన్ని గంటల్లోనే కోట్లాది వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు, సినీ ప్రముఖులు రామ్ చరణ్ ఊరమాస్ లుక్కు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి (Rishab Shetty) చేరిపోయారు. ‘పెద్ది’ ట్రైలర్‌పై ఆయన కురిపించిన ప్రశంసల జల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
‘ ‘పెద్ది’ అఫీషియల్ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతీ ఫ్రేమ్‌లోనూ ఒక ఫైర్ చూపిస్తూ స్టన్నింగ్ విజువల్స్‌తో అదరగొట్టాడు. ఇక మన కన్నడ లెజెండ్, సెంచరీ స్టార్ శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఈ ట్రైలర్లో మరింత పవర్ఫుల్ ఇంపాక్ట్ చూపించింది. హీరోయిన్ జాన్వీ కపూర్ పల్లెటూరి లుక్‌లో చాలా అందంగా కనిపిస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సన ఎక్సలెంట్ వర్క్ అందించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. ‘పెద్ది’ సినిమా యూనిట్ మొత్తానికి నా హృదయపూర్వక ఆల్ ది బెస్ట్!’ అని తెలిపాడు.దీంతో ఇప్పుడు రిషబ్ శెట్టి లాంటి ఒక క్రియేటివ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ ‘పెద్ది’ ట్రైలర్‌ను ఓపెన్‌గా సపోర్ట్ చేయడంతో కర్ణాటక బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Also Read
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
- Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
- అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ 'AK47' ఔట్? అసలు కారణం ఇదే..
- Kayadu Lohar: రూమర్స్‌కి, నా రోల్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.. 'ది ప్యారడైజ్' పాత్రపై కయాదు షాకింగ్ కామెంట్స్!
The #Peddi trailer looks spectacular.https://t.co/s7bGrILKpf
Mega Power Star @AlwaysRamCharan is looking stunning, absolute fire in every frame. The screen presence of @NimmaShivanna anna adds such a magnificent layer to the film, while #JanhviKapoor adds a beautiful, vibrant… pic.twitter.com/0XlnokyAbg
— Rishab Shetty (@shetty_rishab) May 19, 2026
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!