Kacha Badam: సోషల్ మీడియా పుణ్యమా చాలా మంది టాలెంటెడ్ ఫేమస్ అవుతున్నారు. కానీ ఈ ఖ్యాతిని నిలబెట్టుకోవడంలో చాలా మంది విఫలమవుతున్నారు. రాత్రికి రాత్రే వచ్చిన క్రేజ్‌ని తట్టుకుని నిలబడలేకపోతున్నారు. అలాంటి వాటిలో కచ్చబాదాం సాంగ్ సింగర్ ఒకరు. మన అని అందరిని నమ్మి మోసపోయాడు. అప్పట్లో కచ్చాబాదామ్ పాట యూట్యూబ్‌ని షేక్ చేసిన విషయం తెలిసిందే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన భుబన్ బద్యాకర్ ఈ పాటతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు. ఒక్క పాటతో శెనగ వ్యాపారి ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు. కచ్చాబాదాం పాటలు పాడుతూ, ప్రదర్శనలతో తెగ బిజీ అయిపోయాడు. అలా పాడుతూ వచ్చిన డబ్బులను వచ్చినట్లే ఖర్చు పెట్టేశాడు. అతను ప్రదర్శనల ద్వారా వచ్చిన డబ్బులతో కారు కొన్న భుబన్, దురదృష్టం వెంటాడింది. తన ఊరి జనాలే అనుకుని అడిగిన వాళ్లకు అప్పులు ఇస్తూ పోయాడు. మరోవైపు డబ్బు తరిగిపోతుండటంతో చుట్టాలు దూరమయ్యారు. యాక్సిడెంట్‌తో ఆస్పత్రి పాలయ్యాడు. ఏంచేయాలో అర్థంకాలేదు.. చివరికి డబ్బుకోసం జనాల వేధింపులను తట్టుకోలేక సొంతూరిని విడిచి, ఇంటికి దూరంగా అద్దె ఇంట్లోకి చేరి మళ్లీ వేరుశనగ బిజినెస్లోకే దిగాడు.
Read also: Tamarind Seeds: ఆన్లైన్‌లో చింతగింజల అమ్మకాలు.. ధర ఎంతో తెలుసా?
అయితే మళ్లీ అదే పరిస్థితి రావడంతో ఓ ఛానల్ భూబన్ కు ఇంటర్వూ చేసింది. తనకి చదువు, లోక జ్ఞానం లేకపోవడంతో తాను మోసపోయానని ఇంటర్వూలో వివరించాడతను. కొందరిని నమ్మి ఓ అగ్రిమెంట్ పేరుతో ఒక కంపెనీ తనను చాలా మోసం చేసిందని వాపోయాడు. అయితే.. యూట్యూబ్‌లో తాజాగా ఏ సాంగ్ అప్లోడ్ చేసినా తనకు కాపీరైట్ ఇష్యూ వస్తోందని అంటున్నాడు భుబన్. తను పాడిన బాదాం అనే పదం ఉంటే చాలు తీసేయాల్సిందేనంటూ యూట్యూబ్ నోటీసులు పంపిస్తోందని కన్నీరు పెట్టుకున్నాడు. అయితే.. ఎదుటి వారిని నమ్మి ఓ ఒప్పందం మీద ఏమీ చూసుకోకుండా, తెలుసుకోకుండా సంతకం చేయడమే దీనికి కారణం అని చెప్పుకొచ్చాడు భుబన్. భుబన్ స్వస్థలం భీర్‌భూం జిల్లాలోని కురల్జూరి గ్రామం.
అయితే భుబన్ సెలబ్రిటీగా మారాక పలు దఫాలుగా ఆయన దగ్గర నుంచి గ్రామస్తులు డబ్బులు కాజేశారని వాపోయాడు. అయితే బాదాం పదంపై నోటీసులు రావడంతో.. అక్కడున్న యువకుల వేధింపులు భరించలేక 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామంలో భార్యాపిల్లలతో కలసి అద్దె ఇంట్లోకి మారాడు భుబన్. అయితే.. ఆ ఇంటికి నెలకు రూ.2,700 అద్దె చెల్లిస్తున్నానని చెప్పుకొచ్చాడు. తాను మళ్లీ వీధికెక్కి పల్లీలు అమ్ముకుంటూ జీవనాన్ని సాగిస్తున్నానని ఆవదేన వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కరిని నమ్మి మోసపోయానని, కానీ నాకుటుంబంతో కష్టాలున్నా కష్టపడి బతుకు సాగిస్తున్నానని భుబన్ చెప్పుకొచ్చాడు. అప్పట్లో కచ్చా బాదాం సాంగ్ దేశాన్నే షేక్ చేసిన భుబన్ ఇప్పుడు మళ్లీ పల్లీలు అమ్ముకుంటుంటే అయ్యోపాపం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అందుకే ఎవరిని నమ్మకూడదు అంటూ నెటిజన్లు సలహా ఇస్తున్నారు. నీకు మంచి రోజులు వస్తాయి బ్రో అంటూ ఆల్ దిబెస్ట్ యువర్ ఫ్యూచర్ అంటున్నారు. నిన్ను మోసం చేసినవారికి నీకంటే ధీన స్థితి వస్తుందని కామెంట్లతో భుబన్ ను ప్రోత్సహిస్తు ధైర్యాన్ని కోల్పోవద్దు బ్రో అంటున్నారు.
Sabitha Indra Reddy : ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉంటారు