రామ్ గోపాల్ వర్మ ఈ పేరు ఒకప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఓ బ్రాండ్. మూస ధోరణిలో కొట్టుకుపోతున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో శివ రూపంలో సరికొత్త అధ్యాయం లిఖించాడు. కానీ తర్వాత తర్వాత వల్గర్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఒకరు తొక్కకుండానే తన చెత్త, రోత సినిమాలతో సెల్ప్ గోల్ వేసుకున్నాడు. ఆర్జీవీ సినిమాలంటే పూర్తిగా ఇంట్రస్ట్ కోల్పోయారు జనాలు. కానీ సడెన్లీ సత్య రి రిలీజ్ టైంలో జ్ఞాన నేత్రం తెరుచుకుంది ఆర్జీవీకి. ఇకపై గుడ్ ఫిల్మ్స్ చేస్తానని స్టేట్ మెంట్ పాస్ చేసి సిండికేట్ స్టోరీ రెడీ చేశాడు.
Also Read : Venky77 : త్రివిక్రమ్ సినిమాలో వెంకీగారి సరసన హీరోయిన్ గా ‘శెట్టి గారు’ ఫిక్స్
సిండికేట్ కోసం ఆర్జీవీ భారీ స్టార్ కాస్ట్ ప్లాన్ చేసుకున్నాడు కానీ ఎవరూ సెట్ కాలేనట్లు ఉంది. ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసి కొత్త మూవీని ఎనౌన్స్ చేశాడు. బాలీవుడ్ ట్రెండింగ్ జోనర్ హారర్ కామెడీ ఫిల్మ్‌తో రాబోతున్నాడు. పోలీస్ స్టేషన్ మే భూత్ అంటూ బీటౌన్ ఫిల్మ్ రెడీ చేస్తున్నాడు. మనోజ్ బాజ్ పేయ్, జెనీలియా హీరో హీరోయిన్లు. సత్యతో తనకు ఓ మంచి లైఫ్ ఇచ్చిన మనోజ్‌తో మరోసారి ఆర్జీవీతో కలిసి వర్క్ చేయబోతున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో పలు సినిమాలు మంచి హిట్స్ అందుకున్నాయి. ఆర్జీవీ- మనోజ్ బాజ్ పేయ్ కాంబోలో ఇప్పటి వరకు సత్య, ప్రేమ కథ, శూల్, కౌన్, సర్కార్3లాంటి ఫిల్మ్స్ వచ్చాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మే భూత్ అనే హారర్ కామెడీని ప్లాన్ చేస్తున్నాడు. స్టోరీ కూడా రివీల్ చేశాడు ఆర్జీవీ. ఓ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ చేతిలో గ్యాంగ్ స్టర్ పోలీస్ స్టేషన్‌లో ఖతమైతే అతడు తిరిగి దెయ్యమై వస్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నాడు ఒకప్పటి వర్సటైల్ డైరెక్టర్. గతంలో ఎన్నో హారర్ చిత్రాలు తెరకెక్కించిన ఆర్జీవీకి ఇలాంటి సినిమాలు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇది మంచి సినిమా అవుతుందో లేదా రామ్ గోపాల్ వర్మ ఈజ్ బ్యాక్ అనిపించుకన్నాడా అనేది తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.