Prabhas: రెండు ఎకరాల్లో ప్రభాస్ అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ బడ్జెట్ చిత్రాలతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోగా దూసుకుపోతున్నారు. హైదరాబాద్‌లోని అత్యంత కాస్లీ ఏరియాగా పేరుగాంచిన కోకాపేటలో ప్రభాస్ తన సరికొత్త డ్రీం హౌస్ నిర్మించే పనులను అధికారికంగా ప్రారంభించారు.రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్‌లోనే టాప్ లొకేషన్‌గా దూసుకుపోతున్న కోకాపేట ఓఆర్ఆర్ (ORR) ఎగ్జిట్ సమీపంలో ప్రభాస్‌కు చెందిన రెండు ఎకరాల భారీ స్థలంలో ఈ నూతన గృహ నిర్మాణం జరుగుతోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ స్థలంలో అన్ని రకాల అత్యాధునిక హంగులు, గ్లోబల్ స్టాండర్డ్స్‌తో కూడిన ఒక ‘అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్’ను ప్లాన్ చేశారు.ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్స్ డిజైన్ చేసిన ఈ లగ్జరీ ప్యాలెస్‌లో భారీ హోమ్ థియేటర్, అత్యాధునిక జిమ్నేషియం, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్పోర్ట్స్ ఏరియాతో పాటు ప్రభాస్ సినిమాల సిట్టింగ్స్, కథల చర్చల కోసం ప్రత్యేకంగా ఒక ల్యావిష్ లాంజ్‌ను కూడా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లొకేషన్లో గృహ నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక భూమి పనులు శరవేగంగా సాగుతున్నాయి. షూటింగ్స్ లేని సమయంలో ప్రభాస్ ప్రశాంతంగా గడిపేందుకు, అలాగే ఇండస్ట్రీ ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చేందుకు వీలుగా ఈ అల్ట్రా ప్రైవేట్ ప్రాపర్టీని డెవలప్ చేస్తున్నారు. ఒకవైపు కొత్తింటి పనులు చూసుకుంటూనే.. ప్రభాస్ తన లైనప్‌తో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
MOTOROLA Moto Book 60 Pro: మళ్లీరాని ఆఫర్.. మోటరోలా AI ల్యాప్‌టాప్.. సగం ధరకే.. OLED డిస్ప్లే
-
హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమేనా?.. బాలీవుడ్ ట్రెండ్‌పై హుమా ఫైర్
-
Motichoor Laddu Recipe: మార్కెట్ లడ్డూలు తిని విసిగిపోయారా?.. ఇంట్లోనే మెత్తని మోతీచూర్ లడ్డూ సులువుగా..
-
Tilak Varma: వైస్ కెప్టెన్‌పై పీక్స్‌లో ఒత్తిడి.. నేడు తెలుగు తేజం తిలక్ వర్మకు ఛాన్స్ దక్కుతుందా?
ట్రెండింగ్
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!