Jaru Mitai Song: మంచు విష్ణు నటించిన “జిన్నా” సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అందులోని “జారు మిఠాయ” పాట సోషల్ మీడియాలో పెద్ద హిట్ అయ్యింది. ఈ పాటలో రీల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మోహన్‌బాబు స్వయంగా మాట్లాడుతూ “ఆమె మా ఊరి నుంచి వచ్చింది పాట పాడుతారు అని చెప్పేంత వరకు అసలు అలాంటి పాట ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. సాహిత్యం, గాత్రం బాగున్నాయని కొందరు అంటున్నారు. ఇది సన్నీ లియోన్ పాట అని కొందరంటే, మరికొందరు కొత్త తరహా మిఠాయి అని అనుకుంటున్నారు. ఈ పాటపై చాలా మంది తమ అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు. జిన్నా సినిమా థియేటర్ లో వచ్చివెళ్లి చాలాకాలం అయినా.. ఈ పాట జనాల మదిలో స్టాండర్డ్ గా నిలిచిపోయిందని చెప్పొచ్చు.
Read also: CM KCR: మహబూబాబాద్ లో బీఆర్ఎస్, కలెక్టరేట్ నూతన కార్యాలయం.. ప్రారంభించిన కేసీఆర్
సోషల్ మీడియా పుణ్యామా అని ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు ఈ పాట యొక్క అసలు అర్థం గురించి వేదికపై పాడిన భారతి అనే మహిళను కూడా ఇంటర్వ్యూ చేశాయి. ఈ సందర్భంగా ఆమె ఈ పాట పుట్టుక గురించి సవివరంగా వివరించారు. భారతి చిత్తూరు జిల్లా పరువులు గ్రామంలో నివసిస్తోంది. తాను చిన్నప్పుడు మేకలు, గొర్రెలు మేపేందుకు వెళ్లినప్పుడు.. ఇలాంటి జానపద పాటలు పాడేవాళ్ళమని ఆవిధంగా తాను కూడా ఇవి నేర్చుకున్నాని తెలిపింది. అసలు “జంబలకిడి జారు మిఠాయి” అనేది ఒక అమ్మాయి పేరట..! మరి “మొగ్గలఖాలింగో” అనేపదానికి అర్థం అబ్బాయిలెవరు మనవైపు చూడట్లేదని అర్థమట. అయితే ఈపాట పాడినందుకు గాను మోహన్ బాబు ఆమెకు 50వేలు రూపాయలు ఇచ్చినట్లు సంతోషాన్ని పంచుకుంది. కాగా.. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో ఇలాంటి జానపద గేయాలకు ప్రాముఖ్యత పెరుగుతూఉంది. అయితే దారి చూడుదుమ్మూజూడు మామ, దాని పేరే సారంగడరియా ఇలా సినిమాల్లో రిలీజ్ అయ్యి జానపద పాటలు సినిమాకే ఓ రేంజ్ లో క్రేజ్ ను తెచ్చిపెట్టాయె మనందరికి తెలుసు.
Anasuya: బెడ్ మీద అనసూయ.. వామ్మో ఓరేంజ్‌లో..