తెలంగాణ గడ్డపై పోరాడిన వీరుల చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబీ సింహా, వేదిక, ప్రేమ, అనుష్య త్రిపాఠి, ఇంద్రజ, అనసూయ, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రలు పోషించారు. గతేడాది మార్చిలో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఓ మోస్తారు సక్సెస్ రాబట్టింది.
Also Read : DaakuMaharaaj : డాకు మహారాజ్ ఇప్పటికీ RR వర్క్ పెండింగ్
రాజాకార్ల పాలనలో జరిగిన డార్క్ సైడ్ ను సిల్వర్ స్క్రీన్ పై చక్కగా మలిచాడు దర్శకుడు.ఈ సినిమా రిలీజ్ కు ముందు పలు వివాదాలకు కారమైంది. విడుదల చేయద్దంటూ కోర్టుల్లో కేసులు కూడా వేసారు. అలా రిలీజ్ అయిన ఈ సినిమాను ఓటీటీ లో మాత్రం రిలీజ్ కాలేదు. థియేటర్స్ లో రిలీజ్ అయి పది నెలలు కావొచ్చినా ఓటీటీ రిలీజ్ కానీ ఈ సినిమా ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. రజాకార్ ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు ప్లాట్ ఫామ్ ఆహా కొనుగోలు చేసింది. ఇన్నాళ్లకు అహ స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది. జనవరి 24 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ‘రజాకార్’ మూవీ స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. పలు వివాదాలకు కారణమైన ఈ సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్ రాబడుతుందని ఆహా భావిస్తోంది. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రానికి గూడూరు నారాయణ రెడ్డి నిర్మాతగా వ్యవహరిచారు..