మాస్ మహారాజా రవితేజ 2021 సంవత్సరాన్ని ‘క్రాక్’ బ్లాక్ బస్టర్ హిట్ తో ప్రారంభించారు. కరోనా టైంలో అది కూడా 50% ఆక్యుపెన్సీ ఉన్న సమయంలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. హిట్ టాక్ తో నిర్మాతలను లాభాల బాట పట్టించింది. ఇక చాలాకాలం తరువాత హిట్ అందుకున్న రవితేజ తన మార్కెట్ ను పెంచుకోవడానికి సహాయపడే స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో “ఖిలాడీ” అనే థ్రిల్లర్ మూవీలో ఈ సీనియర్ హీరో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వకముందే రవితేజ నెక్స్ట్ ప్రాజెక్ట్ శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కునున్న ప్రాజెక్ట్ షూటింగ్ కు రెడీ అయిపోయారట. ప్రస్తుతం రవితేజ దర్శకుడు శరత్ మాండవతో కలిసి తన రాబోయే చిత్రాన్ని స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
Read Also : బ్యాక్ లెస్ డ్రెస్ లో వేదిక హాట్ ట్రీట్… పిక్స్
సినిమా షూటింగ్ కు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట. ఈ మూవీ షూటింగ్ జూలై 1 నుండి ప్రారంభమవుతుందని సన్నిహిత వర్గాల సమాచారం. ఈ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ ఏర్పాటు చేశారు. మొదటి షెడ్యూల్‌లో రవితేజపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించబడతాయి. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించనుంది. ఇందులో రవితేజ ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త మేకోవర్ తో కనిపించనున్నాడు అంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. నాసర్, నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్, ఎల్‌ఎల్‌పి బ్యానర్ లపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు స్వరకర్త సామ్ సిఎస్, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్, ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్.