రవితేజ హీరోగా మాస్ జాతర అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సితార నాగవంశీ నిర్మాతగా ఈ సినిమాని భాను భోగవరపు డైరెక్టు చేస్తున్నారు. ధమాకా సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీ లీల ఈ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. అయితే, ఇప్పటికే విడుదల కావలసిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాని అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్.
Also Read : Chiranjeevi Deepfake Case: AI మార్ఫింగ్ షాక్ – చిరంజీవిపై అశ్లీల వీడియోలు వైరల్!
ఇక ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించాలని సినిమా యూనిట్ ముందుగా భావించి, ఈ మేరకు మీడియాకు సమాచారం కూడా ఇచ్చింది. కానీ, అది ఇప్పుడు క్యాన్సిల్ అయినట్లు అధికారిక సమాచారం వచ్చింది. దాని బదులు, రేపు హైదరాబాద్ జేఆర్సి కన్వెన్షన్‌లో సూర్య చీఫ్ గెస్ట్‌గా ఈ మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులు రెండు ఈవెంట్స్ ఎందుకు అనుకున్నారో ఏమో తెలియదు కానీ, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. అయితే, ట్రైలర్ లాంచ్ డిజిటల్‌గా మాత్రం జరుగుతుందని, కేవలం ఈవెంట్ క్యాన్సిల్ చేశామని సమాచారం ఇచ్చారు. ఇక రవితేజ 75వ సినిమాగా రూపొందిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.