Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Irumudi Remuneration: మాస్ మహారాజా రవితేజ సినిమాలంటే మాస్ ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్. సాధారణంగా ఆయన ఒక్కో సినిమాకు రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారనే టాక్ ఉంది. అయితే తాజాగా ఆయన నటించిన ‘ఇరుముడి’ విషయంలో మాత్రం రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకునే విధానాన్ని ఎంచుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో రవితేజకు ఏకంగా రూ.50 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందనే చర్చ ట్రేడ్ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ‘ఇరుముడి’ భారీ విజయాన్ని అందించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా విడుదలైన తొలి వారంలోనే రూ.135 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. దీంతో రవితేజ కెరీర్లో రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన చిత్రంగా ‘ఇరుముడి’ నిలిచిందనే టాక్ వినిపిస్తోంది. 2022లో వచ్చిన ‘ధమాకా’ తర్వాత రవితేజ వరుసగా పలు సినిమాలు చేసినప్పటికీ వాటికి ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. ఈ నాలుగేళ్లలో వచ్చిన ఆరు సినిమాల్లో ఎక్కువ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. కొన్ని సినిమాలకు కనీసం రూ.10 కోట్ల వసూళ్లు రావడం కూడా కష్టంగా మారిందనే విశ్లేషణలు వచ్చాయి. అయినప్పటికీ రవితేజ తన రెమ్యునరేషన్‌ను తగ్గించకుండా రూ.20-25 కోట్ల రేంజ్‌లోనే కొనసాగించారనే టాక్ ఉంది.
వరుస ఫ్లాపుల నేపథ్యంలో నిర్మాతలు రవితేజతో సినిమా చేయడానికి ఆలోచించే పరిస్థితి వచ్చిందని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ‘ఇరుముడి’ కోసం రెమ్యునరేషన్ తీసుకోకుండా, సినిమా లాభాల్లో వాటా తీసుకునేలా రవితేజ ఒప్పందం చేసుకున్నారని సమాచారం. సినిమా భారీ విజయం సాధించడంతో ఈ నిర్ణయం ఆయనకు బాగా కలిసొచ్చిందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వినిపిస్తున్న లెక్కల ప్రకారం ‘ఇరుముడి’ లాభాల్లో రవితేజ వాటా రూ.50 కోట్లకు పైగా ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మొత్తం, ఒప్పంద వివరాలపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు. ఇక ‘ఇరుముడి’ సక్సెస్‌తో రవితేజ వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హసిత్ గోలి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్న సినిమాలో ఆయన నటించనున్నారు. అదే సమయంలో దర్శకుడు వివేక్ ఆత్రేయతో రవితేజ కాంబినేషన్‌పై కూడా కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల రవితేజను వివేక్ ఆత్రేయ కలవడంతో ఈ ప్రాజెక్ట్‌పై మళ్లీ చర్చ మొదలైంది. ‘సరిపోదా శనివారం’ తర్వాత వివేక్ ఆత్రేయ తెరకెక్కించబోయే చిత్రం ఇదేనా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి రెమ్యునరేషన్ కంటే లాభాల్లో వాటా తీసుకునే ఫార్ములాతో రవితేజ ముందుకు వెళ్తున్నారనే టాక్ ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. సినిమా భారీ హిట్ అయితే రెగ్యులర్ రెమ్యునరేషన్ కంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉండగా.. ఫ్లాప్ అయితే మాత్రం రిస్క్ కూడా అదే స్థాయిలో ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
- Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
- Nagarjuna: నాగార్జునకు బర్త్‌డే విషెస్ చెప్పబోయి అడ్డంగా బుక్కైన ప్రగ్యా జైస్వాల్
- Irumudi OTT : ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
- Ravi Teja: ఇరుముడి జోష్‌లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?
తాజావార్తలు
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్‌లో కనిపిస్తున్న మృతదేహాలు..
-
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
-
CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!