Irumudi : పవిత్ర దీక్షను తాగుబోతులకు ఆపాదిస్తారా? ‘ఇరుముడి’పై భగ్గుమన్న అయ్యప్ప భక్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ ‘ఇరుముడి’ సినిమా ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. బాక్సాఫీస్ వద్ద మూడో వారంలోనూ వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రంపై అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అత్యంత పవిత్రమైన ‘ఇరుముడి’ పేరును ఒక క్రైమ్ థ్రిల్లర్ కి పెట్టి, అందులో అయ్యప్ప దీక్షను కించపరిచేలా మద్యం సేవించే సన్నివేశాలు చిత్రీకరించడంపై వారు మండిపడుతున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో సమావేశమైన సమితి సభ్యులు చిత్ర యూనిట్‌పై నిప్పులు చెరిగారు. కేవలం మందు తాగేవాళ్లే అయ్యప్ప మాల వేస్తారని, దీక్ష ముగిసిన వెంటనే మళ్లీ తాగుతారని సినిమాలో చూపించడం కోట్లాది మంది గురుస్వాముల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుముడి కట్టుకొని శబరిమల వెళ్తే స్వామివారు ఆ కుటుంబాన్ని కాపాడతారనే భక్తి భావాన్ని పక్కనపెట్టి, కమర్షియల్ అంశాలతో క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమా తీయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం సినిమాలో ఉన్న రెండు అయ్యప్ప స్వామి పాటల వల్లే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ అయిందని వారు స్పష్టం చేశారు.
పవిత్రతకు భంగం కలిగించిన రవితేజ, దర్శక నిర్మాతలతో సహా చిత్ర బృందం మొత్తం బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని సమితి సభ్యులు డిమాండ్ చేశారు. శబరిమల వెళ్లి స్వామివారి సన్నిధిలో శరణు వేడితేనే వారికి క్షమాభిక్ష ఉంటుందని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. కాగా, ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను, టీచర్లను అవమానించారంటూ ఇటీవల ఉపాధ్యాయ సంఘాలు సైతం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ వివాదంపై దర్శకుడు శివ నిర్వాణ స్పందిస్తూ.. తాను కూడా బీఈడీ చేసి కొన్నాళ్లు టీచర్‌గా పనిచేశానని, వ్యవస్థను కించపరచడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు. సమాజంలో ఆడపిల్లలపై అకృత్యాలకు పాల్పడే కొన్ని చీడపురుగులను మాత్రమే హార్డ్ హిట్టింగ్ గా చూపించానని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ ఉపాధ్యాయుల వివాదం పూర్తిగా సద్దుమణగక ముందే, ఇప్పుడు ఏకంగా అయ్యప్ప భక్తుల మనోభావాల అంశం తెరపైకి రావడం ‘ఇరుముడి’ మేకర్స్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.
Also Read
- Viswanadh & Sons : ఈ వారమే OTTలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఎక్కడ చూడాలంటే?
- AVD తర్వాత మరో మల్టీప్లెక్స్.. నార్త్ హైదరాబాద్‌పై రౌడీ హీరో కన్ను!
- Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
- Tollywood vs Kollywood: తెలుగు గడ్డపై తమిళ హీరోల జోరు.. మరి కోలీవుడ్‌లో తెలుగు సినిమాల పరిస్థితి దారుణమా?
తాజావార్తలు
-
Irumudi : పవిత్ర దీక్షను తాగుబోతులకు ఆపాదిస్తారా? ‘ఇరుముడి’పై భగ్గుమన్న అయ్యప్ప భక్తులు..
-
Viswanadh & Sons : ఈ వారమే OTTలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఎక్కడ చూడాలంటే?
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
-
Cheapest Phone: కిందపడినా పగలని ఫోన్.. కేవలం రూ.1499లకే..
-
AVD తర్వాత మరో మల్టీప్లెక్స్.. నార్త్ హైదరాబాద్‌పై రౌడీ హీరో కన్ను!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!