Ravi Teja: ‘వామ్మో వాయ్యో’ సాంగ్ రిలీజ్.. సంక్రాంతి స్పెషల్ మాస్ బీట్ రెడీ
- రవితేజ కొత్త మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి..
- ఈ చిత్రం నుంచి ‘వామ్మో వాయ్యో’ సాంగ్ రిలీజ్..
- ఈ సాంగ్ కచ్చితంగా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది: చిత్ర యూనిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Teja: రవితేజ హీరోగా కిశోర్ తిరుమల డైరెక్షన్ లో రూపొందించిన మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా.. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంది. ఈనెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నాడు వరంగల్‌లో ఈ చిత్ర గీతాన్ని విడుదల చేశారు. ‘‘వామ్మో వాయ్యో’’ అంటూ సాగిన ఈ జానపద పాటకు భీమ్స్ సెసిరోలె స్వరాలు సమకూర్చగా.. దేవ్ పవార్ సాహిత్యం అందించారు. స్వాతి రెడ్డి పాటను ఆలపించారు. శేఖర్ మాస్టర్ నృత్యరీతులు అందించారు. ఈ పాటలో రవితేజ, ఆషికా, డింపుల్ వేసిన స్టెప్పులు అందరిని ఆకట్టుకుంటున్నాయి.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- The Traitors India Season 2: ట్రేటర్లే విజేతలు.. రూ.66 లక్షలు ప్రైజ్ మనీని కొట్టేసిన కిలాడి భామలు!
- Duniya Vijay: పెళ్లి బంధానికి గుడ్‌బై చెప్పిన విజయ్.. విడాకులు తీసుకున్న స్టార్ హీరో!
- Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ స్టార్స్.. ఆలియా భట్, షాహిద్ కపూర్ స్పెషల్ రోల్స్‌లో?
- Bethlehem Kudumba Unit : 'బెత్లెహం కుడుంబ యూనిట్' తెలుగు విడుదలకు అడ్డంకి
అయితే, ఈ సందర్భంగా డైరెక్టర్ కిశోర్ తిరుమల మాట్లాడుతూ.. ‘‘ఇది ఆద్యంతం వినోదాత్మకంగా సాగే కుటుంబ కథా సినిమా.. కచ్చితంగా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. థియేటర్లకు వచ్చి ఈ చిత్రాన్ని ఆస్వాదించండి’’ అన్నారు. ఇక, చాలా రోజుల తర్వాత ‘వామ్మో వాయ్యో’ లాంటి మాస్ పాట చేశా.. ఇది మాకెంతో ప్రత్యేకమైన సాంగ్ అని నటి డింపుల్ హయాతి చెప్పుకొచ్చింది. అలాగే, ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ.. థియేటర్లో ఈ పాట అందర్నీ అలరిస్తుంది. చాలా ఎనర్జీతో నిండిన మాస్ సాంగ్ ఇది.. ఈ పాట కోసం నేను.. డింపుల్ చాలా కష్టపడి డ్యాన్స్ చేశామని వెల్లడించింది.
#BharthaMahasayulakuWignyapthi third single #VaammoVaayyo out now ❤️https://t.co/3lzkm6lCAk#BMW in cinemas on JANUARY 13th, 2026! pic.twitter.com/y5Q99IiqqH
— Ravi Teja (@RaviTeja_offl) January 2, 2026
తాజావార్తలు
-
iQOO 16: ఐకూ 16 అదిరిపోయే గేమింగ్ ఫోన్.. 8,500mAh బ్యాటరీ, 16GB RAM, 50MP ట్రిపుల్ కెమెరా!
-
The Traitors India Season 2: ట్రేటర్లే విజేతలు.. రూ.66 లక్షలు ప్రైజ్ మనీని కొట్టేసిన కిలాడి భామలు!
-
Sugar Price: సామాన్యులకు గుడ్‌న్యూస్! కేంద్రం సంచలన నిర్ణయం.. చక్కెర ధరలు దిగి వస్తాయా?
-
Vivo V80 Lite 5G: వివో వి80 లైట్ 5జీ వచ్చేసింది.. 10,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 16GB వరకు RAM!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే అంతే సంగతులు!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!