Rashmika Mandanna: కృతి హాట్‌నెస్‌పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్మిక మందన్నా, బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ హిందీ చిత్రం ‘కాక్టెయిల్ 2’ (Cocktail 2). ఆదివారం ముంబై వేదికగా ఈ సినిమాకు సంబంధించిన ఒక గ్రాండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో రష్మిక తన కో-స్టార్ కృతి సనన్‌ను విపరీతంగా పొగిడే క్రమంలో ఎవరూ ఊహించని విధంగా ఒక ‘F-బాంబ్’ (బూతు పదం) వాడేసింది. దీంతో అక్కడున్న మీడియా, ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఈవెంట్ స్టేజ్ పైన రష్మిక చాలా ఉత్సాహంగా మాట్లాడుతూ పక్కనే ఉన్న కృతి సనన్ వైపు తిరిగి ప్రశంసల జల్లు కురిపిస్తూ..‘ ‘కాక్టెయిల్ 2’ లో ఏదో ఒక కొత్తదనం ఉంది. కృతి.. నువ్వు చాలా హాట్‌గా ఉన్నావు. ఆ విషయం ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు.. అండ్ యు ఆర్ ఫింగ్ హాట్ (You are fuc*ing hot)!’.. అని అనేసింది. కానీ రష్మికకు మరుక్షణమే అర్థమైంది తాను ఎంత పెద్ద మాట అన్నాదో.. వెంటనే షాక్‌తో తన చేతులతో నోరు మూసుకుంది. ఆ తప్పును కవర్ చేయడానికి నవ్వుతూ.. ‘ఓహ్ సారీ! దాన్ని సైలెన్స్ (సెన్సార్) చేసేయండి’ అని హిలేరియస్‌గా కౌంటర్ ఇచ్చింది. రష్మిక రియాక్షన్‌కు అక్కడ ఉన్న ఆడియన్స్, మీడియా వాళ్లు గట్టిగా నవ్వుతూ కేకలు వేశారు. ఆ తర్వాత రష్మిక తేరుకుని.. ‘ఆమె చాలా అమేజింగ్.. లుక్ ఎట్ హర్. మా మధ్య చాలా ఎక్కువ ప్రేమ నడుస్తోంది’ అంటూ కృతిపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది.
Also Read
- Irumudi : 'ఇరుముడి' నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
- Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
- Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
- Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
స్టేజ్ పైన ఉన్నవాళ్లు ఈ విషయాన్ని నవ్వుతూ లైట్ తీసుకున్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం రష్మిక వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఎంతో పద్ధతిగా, పద్ధతైన పదాలతో మాట్లాడే రష్మిక.. ఈసారి ముంబై కల్చర్‌కు అలవాటు పడి కాస్త ఓవర్‌బోర్డ్ (హద్దులు దాటి) ప్రవర్తించిందని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఫ్లోలో వచ్చే స్లిప్-ఆఫ్-దింగ్ (నోరు జారడం) అయినా.. పబ్లిక్ ఈవెంట్లలో ఇలాంటి పదాలు వాడటం రష్మిక క్లీన్ ఇమేజ్‌కు కాస్త మైనస్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!