Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna: గాన కోకిల ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవితం వెండితెరపైకి రాబోతుందన్న వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ లెజెండరీ సింగర్ బయోపిక్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్ర పోషిస్తోందన్న వార్తలు బయటకు రావడంతో తమిళ తంబీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయ సంగీత శిఖరాన్ని తెరపై ఆవిష్కరించే సత్తా రష్మికకు ఉందా అంటూ సోషల్ మీడియా వేదికగా నిరసన గళం విప్పుతున్నారు. ఇటీవలే లాంఛనంగా స్టార్ట్ అయిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం పూర్తిగా మహిళా ప్రాధాన్య స్టోరీతో తెరకెక్కనుంది. కళ, సంగీతం, భక్తి కలగలిసిన ఒక అరుదైన గాన మాంత్రికురాలి నిజ జీవిత సంఘటనల ఆధారంగా మేకర్స్ దీనిని రూపొందిస్తున్నారు. కేవలం భారతీయ ప్రేక్షకులకే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ శ్రోతలను, ప్రపంచవ్యాప్త సంగీత ప్రియులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాత్ర కోసం రష్మిక మందన్నను మేకర్స్ ఎంపిక చేయడం తమిళ తంబీలకు నచ్చినట్లు కనిపించడం లేదు. సాధారణంగా కమర్షియల్ సినిమాలు, గ్లామర్ పాత్రలతో పాపులర్ అయిన రష్మిక.. కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి పాత్రకు ఎలా న్యాయం చేయగలదంటూ తమిళ ప్రేక్షకులు, సంగీత అభిమానులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. సుబ్బులక్ష్మి గారి హుందాతనం, భక్తిభావం, శాస్త్రీయ సంగీత ఉచ్చారణ రష్మిక ఆహార్యానికి అసలు సరిపోవని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. గ్లామర్ ప్రపంచంలో దూసుకుపోతున్న ఒక హీరోయిన్ను ఇలాంటి చారిత్రాత్మక క్లాసికల్ బయోపిక్‌లో నటింపజేయడం వెనుక కేవలం మార్కెట్ సమీకరణాలే తప్ప కళాత్మక దృష్టి లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మేకర్స్ మాత్రం ఈ పాత్ర కోసం రష్మిక ప్రత్యేకంగా సిద్ధమవుతోందని, ఆమె నటనలోని సరికొత్త కోణాన్ని ప్రపంచానికి చూపిస్తుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా, సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే కోలీవుడ్ వర్గాల నుంచి వస్తున్న ఈ వ్యతిరేకత ప్రాజెక్ట్‌పై భారీ ఉత్కంఠను రేపింది. ఈ విమర్శలను దాటుకుని రష్మిక ఆ లెజెండరీ పాత్రను ఎలా మెప్పిస్తుంది? తంబీల ఆగ్రహాన్ని ప్రశంసలుగా మార్చుకోగలదా? అన్నది ప్రస్తుతం కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హాట్ టాపిక్‌గా మారింది.
Also Read
- C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
- Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
- Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
- Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
తాజావార్తలు
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
-
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!