నేషనల్ క్రష్ రష్మిక 2023 లో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటించింది.. చివరగా నటించిన యానిమల్ సినిమాలో హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఈ సినిమా హిట్ తర్వాత అమ్మడు చాలా బిజీగా ఉన్నారు.. హైదరాబాద్ టు ముంబై తిరుగుతూ చక్కర్లు కొడుతుంది.. ఈ నేపథ్యంలో ఓ చిన్న పొరపాటు చెయ్యబోయ్యింది.. వెంటనే అలెర్ట్ అయ్యి క్షణాల్లో తప్పించుకుంది.. అందుకు సంబందించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
తన కారులో బదులు వేరొకరి కారులో ఎక్కి కూర్చోబోవడం కాదని తెలిసి కంగారు పడటం.. ఆ వీడియో కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది.. పుష్ప తర్వాత అమ్మడు క్రేజ్ పూర్తిగా పెరిగిపోయింది.. యానిమల్ సినిమా తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ఈ నటి. ఇటీవల యానిమల్ సక్సెస్ మీట్‌లో పాల్గొనడానికి రష్మిక ముంబయి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆమెతో సెల్ఫీ దిగాలని అభిమానులు వెంట పడ్డారు.. ఫ్యాన్స్ నుంచి తప్పించుకొనే క్రమంలో కంగారు పడ్డారు.. ఆ తొందరలో ఆమె తన కారుకు బదులుగా వేరొకరి కారును ఎక్కబోయ్యింది..
అది గమనించిన తన టీమ్ వెంటనే మన కారు కాదు అని చెప్పడంతో ఖంగు తిన్నారు. వెంటనే వేగంగా తన కారువైపు పరుగులు తీసారు. ఈలోపు ఫోటోలు అంటూ ఫ్యాన్స్ వెంటపడుతుంటే ఓ ఇద్దరితో ఫోటోలు దిగి వచ్చేసారు.. రష్మికకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా అయ్యో పాపం రష్మిక ఎంత పనైంది అంటూ కామెంట్స్ చేస్తూ వీడియోను మరింత ట్రెండ్ చేస్తున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే మూవీ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 లో కూడా నటిస్తున్నారు..`

Rashmika Mandanna (2)