Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉండటంతో ఆమె అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ‘మైసా’ షూటింగ్ సమయంలో గాయపడటంతో శస్త్రచికిత్స చేయించుకున్న ఆమె, ప్రస్తుతం ఇంట్లోనే కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ నిశ్చితార్థ వేడుకలో భర్త విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక తొలిసారి బహిరంగంగా కనిపించడం అభిమానులకు ఊరటనిచ్చింది. అంతేకాదు ఈ వేడుకలో ఆమె కనిపించిన తీరు, విజయ్‌తో కలిసి ఇచ్చిన ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ నిర్మాత ఎస్. నిరంజన్ రెడ్డి కుమారుడి నిశ్చితార్థ వేడుక ఆగస్టు 23న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే అందరి దృష్టినీ ఆకర్షించిన జంట మాత్రం రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ. ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ ఇద్దరూ ఈ వేడుకకు జంటగా రావడంతో అక్కడి సందడి మరింత పెరిగింది. ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నవ్వుతూ కనిపించిన వీరి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
- OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
- DADA Movie : 'దాదా'టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
ఈ వేడుకలో రష్మిక నలుపు, బంగారు రంగుల కలయికలో ఉన్న సాంప్రదాయ లెహంగాలో ఎంతో అందంగా కనిపించారు. మరోవైపు విజయ్ దేవరకొండ బ్లాక్ కుర్తాలో క్లాసీ లుక్‌లో కనిపించారు. కెమెరాల ముందు ఇద్దరూ ఎంతో రిలాక్స్డ్గా ఫోజులివ్వడంతో అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ముఖ్యంగా గాయానికి చికిత్స తీసుకున్న తర్వాత రష్మిక ఇలా ఉత్సాహంగా కనిపించడం అభిమానులకు ప్రత్యేకంగా అనిపించింది.
రష్మికకు ఇటీవల ‘మైసా’ సినిమా షూటింగ్ సమయంలో గాయం అయిన సంగతి తెలిసిందే. ఒక సన్నివేశంలో కుడి తుంటిలోని టెండన్ దెబ్బతిన్నట్లు ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇది తనకు వరుసగా ఎదురైన మూడో గాయం అని కూడా ఆమె పేర్కొన్నారు. మొదట ఈ విషయాన్ని బయటకు చెప్పకూడదని భావించినప్పటికీ, అభిమానులకు తన పరిస్థితి గురించి తెలియజేయాలని నిర్ణయించుకున్నట్లు రష్మిక తెలిపారు.
ఆ గాయం నుంచి కోలుకోవడానికి ఆమె శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఆమె పూర్తిగా కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు కూడా. ఇక ‘మైసా’ తన కెరీర్లో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అత్యంత శారీరక శ్రమతో కూడుకున్న ప్రాజెక్ట్‌లలో ఒకటని రష్మిక ఇప్పటికే చెప్పారు. ఈ సినిమాలో ఒక గోండ్ గిరిజన మహిళగా, యాక్షన్‌కు ప్రాధాన్యత ఉన్న పవర్ ఫుల్ పాత్రలో ఆమె కనిపించనున్నారు.
గాయం కారణంగా కొంతకాలం షూటింగ్‌లకు దూరంగా ఉంటూ పూర్తిగా కోలుకోవడంపై రష్మిక దృష్టి పెట్టారు. అందుకే తాజాగా నిశ్చితార్థ వేడుకలో ఆమె కనిపించడం అభిమానులకు మరింత ప్రత్యేకంగా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే రష్మికకు వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మైసా’లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రణబాలి’లో మరోసారి విజయ్ దేవరకొండతో కలిసి నటించనున్నారు. ఇటీవల ఆమె హిందీ చిత్రం ‘కాక్టెయిల్ 2’లో కనిపించారు.
మొత్తానికి గాయం, సర్జరీ కారణంగా కొంతకాలం కెమెరాలకు దూరంగా ఉన్న రష్మిక.. తాజాగా భర్త విజయ్ దేవరకొండతో కలిసి కనిపించడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఆమె పూర్తిగా కోలుకుని త్వరలోనే షూటింగ్‌లకు తిరిగి రావాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.
- Tags
- cinema
- Rashmika Mandanna
తాజావార్తలు
-
Tiffany Trump in Desi Look: అంబానీ గణేష్ వేడుకల్లో ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్.. లెహంగాలో ‘దేశీ’ లుక్ అదుర్స్
-
Japan Centenarians: జపాన్‌లో లక్ష దాటిన 100 ఏళ్ల వృద్ధుల సంఖ్య.. అన్నేళ్ళు ఎలా బతుకుతున్నారు?
-
Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
-
Asian Games 2026: మహిళా అథ్లెట్, పురుష కోచ్‌కు ఒకే గది.. అర్ధరాత్రి వరకు హైడ్రామా!
-
PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలా? గ్యారెంటీ లేకుండానే రూ.3 లక్షల లోన్.. పథకం పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!