నేషనల్ క్రష్, అందాల భామ రష్మిక మందన్నా ప్రస్తుతం తన కొత్త సినిమా “ది గర్ల్‌ఫ్రెండ్” ప్రమోషన్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమె తాజాగా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జీ తెలుగు సెలబ్రిటీ షో “జయమ్ము నిశ్చయమ్మురా” కి గెస్ట్‌గా హాజరైన, తన చలాకీ నడవడితో అందరినీ అలరించింది. ఈ షో ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షోలోకి అడుగుపెట్టగానే జగపతి బాబు ఆమెను చూసి “నీకు ఓ నిక్‌నేమ్ పెట్టాను.. గాలి పిల్ల!” అని అన్నాడు. దానికి రష్మిక నవ్వుతూ “అయ్యయ్యో సర్!” అని బదులిచ్చింది. వెంటనే జగపతి బాబు ఆమెను ఆటపట్టిస్తూ విజయ్‌ల సీరీస్‌ను లిస్ట్ చేశాడు “విజయ్ దేవరకొండ ఫ్రెండ్, విజయ్ సేతుపతి ఫ్యాన్, విజయ్ దళపతి ఆల్‌టైమ్ ఫ్యాన్! మరి విజయం, విజయ్ అంతా నీకేనా?” అని చెప్పడంతో రష్మిక నవ్వుతూ “ఏమో!” అంటూ ప్రేక్షకుల వైపు కన్ను కొట్టింది.
Also Read : The Girlfriend : రష్మికతో పని చేయడం ఓ అందమైన అనుభవం: హీరో దీక్షిత్ శెట్టి
తరువాత రష్మిక చిన్ననాటి ఫోటో చూపించగా ఆమె ఎమోషనల్ అయింది. “అది నా చిన్నతనం.. అప్పట్లో సూర్యవంశం సినిమాలోని ‘రోజావే’ సాంగ్ వింటూ నేను అలాగే నడిచేదాన్ని” అంటూ ఆ స్టెప్‌లోనే చేసి చూపించడంతో ప్రేక్షకులు చప్పట్లతో హోరెత్తాయి. ఇక టాపిక్ మళ్లీ ఆమె చేతిలో వేసుకున్న రింగ్స్ పైకి వెళ్లింది. జగపతి బాబు అడిగాడు “ఈ రింగ్స్ ఏమైనా స్పెషల్ సెంటిమెంటా?” దానికి రష్మిక నవ్వుతూ.. “అవును.. ఇవన్నీ నాకు చాలా ఇంపార్టెంట్ రింగ్స్” అని చెప్పింది. వెంటనే జగపతి బాబు “వాటిలో ఒకటి చాలా ఫేవరెట్ రింగ్, దానికి ఓ హిస్టరీ ఉందట కదా?” అని అన్నప్పుడు రష్మిక సిగ్గుతో నవ్వుతూ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ప్రేక్షకులు పెద్దగా అరవడంతో “నాకు వాళ్ల రియాక్షన్ చాలా ఇష్టం.. నేను దానిని ఎంజాయ్ చేస్తున్నా” అని చెప్పింది. ఈ ఫన్నీ మోమెంట్స్, రష్మిక సిగ్గు పడుతూ చూపించిన ఎంగేజ్మెంట్ రింగ్ షాట్ ప్రోమోలో హైలైట్‌గా మారింది. షో చివర్లో ఆమె నవ్వులు, చిలిపితనం చూసి ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయ్యారు. మొత్తానికి చెప్పకనే చెప్పింది రష్మిక.