Site icon NTV Telugu

Vijay–Rashmika: నిశ్చితార్థ రూమర్స్‌కి చెక్.. సక్సెస్ ఈవెంట్‌లో రష్మికతో విజయ్‌ స్పెషల్ మూమెంట్‌!

Rashmika Vijay

Rashmika Vijay

స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న, దీక్షిత్‌ శెట్టి కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రేమకథ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి రాహుల్‌ రవీంద్రన్ దర్శకత్వం వహించగా, విద్య కొప్పినీడు – ధీరజ్‌ మొగిలినేని నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ మూవీ, విభిన్న కోణంలో ప్రేమను ఆవిష్కరించింది.

Also Read :Rashmika : “ప్రతి ఒక్కరి జీవితంలో ఒక విజయ్ ఉండాలి” – రష్మిక ఎమోషనల్ స్పీచ్‌

ఇక సినిమా విజయోత్సవ వేడుకను (Success Meet) బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు హీరో విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల విజయ్–రష్మికల నిశ్చితార్థం జరిగిందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలపై ఇప్పటివరకు ఇద్దరూ ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఇదే సమయంలో ఈ ఈవెంట్‌లో ఇద్దరూ ఒకే స్టేజ్‌పై కనిపించడంతో అభిమానుల్లో హై ఎక్సైట్మెంట్ నెలకొంది.

అయితే ఈ వేడుకలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. విజయ్‌ రష్మిక చేతిని పట్టుకుని ముద్దాడగా, అభిమానులు ఈలలతో హోరెత్తించారు. రష్మిక కూడా సిగ్గుగా చిరునవ్వులు చిందించడంతో అక్కడి వాతావరణం మరింత హోరెత్తిపోయింది. ఈ క్యూట్ మూమెంట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేస్తూనే, ఇద్దరి కెమిస్ట్రీ మళ్లీ చర్చనీయాంశమవుతోంది. అభిమానులు అయితే “ఇప్పుడు అఫీషియల్ అనుకోవచ్చా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

Exit mobile version